స్నేహితుడిని చంపి..200 ముక్కలు చేసి టాయిలెట్‌లో పడేశాడు.. ఆ తరువాత ఏం జరిగినదో తెలుసా.?

ముంబై లో డబ్బుల కోసం మిత్రుడిని హత్య చేసిన ఘటన వెలుగులోకొచ్చింది. వివరాల్లోకెళితే, ముంబై నగరానికి చెందిన పింటూ శర్మ, గణేశ్‌ కొల్హాద్కర్‌ ఇద్దరు మిత్రులు, పింటూ శర్మ దెగ్గర గణేశ్‌ కొల్హాద్కర్‌ లక్ష రూపాయిలు తీసుకున్నాడు, ఆ డబ్బులో కొంత చెల్లించాడు కూడా, మిగిలిన డబ్బులను ఇవ్వాలని గణేశ్‌ కొల్హాద్కర్‌ ని విసిగించడం మొదలుపెట్టాడు పింటూ శర్మ.

గత నెల డిసెంబర్ 16 న గణేశ్‌ కొల్హాద్కర్‌ ఇంటికి వెళ్ళాడు పింటూ శర్మ. డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. గణేశ్‌ కొల్హాద్కర్‌ ని శర్మ గోడకేసి కొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. గణేశ్‌ కొల్హాద్కర్‌ శవాన్ని ముక్కలు ముక్కలుగా కోసి తన ఇంటి మరుగుదొడ్లో వేసాడు శర్మ. అపార్ట్మెంట్స్ వాళ్ళు డ్రైనేజీ ప్రాబ్లెమ్ ఉందని కంప్లైంట్ ఇవ్వడం తో చెక్ చెయ్యడానికి వచ్చిన వాళ్ళకి మనిషి అవయవాలు కనిపియ్యడం తో పోలీసులకు ఫిర్యాదు చేసారు.

బయటపడ్డ హత్య.. :

పోలీసుల విచారణతో అసలు విషయం బయటపడింది. గణేశ్‌ కొల్హాద్కర్‌ ని హత్య చేసినట్టు పింటూ శర్మ అంగీకరించాడు. ఇంత దారుణంగా ఒక మనిషిని ఎలా హత్య చేసాడో అని అందరూ అనుకుంటున్నారు. స్నేహితుడు అని కూడా చూడకుండా క్రూరంగా చంపేశాడు.

ఇలాంటి ఘటనలు… :

ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. గేమ్ లో ఫ్రెండ్ సహాయం చెయ్యలేదని, తనకు తెలీకుండా అమ్మాయిని ప్రేమించాడని, తాను ప్రేమిస్తున్న అమ్మాయిని తన ఫ్రెండ్ కూడా ప్రేమిస్తున్నాడని, ఇలా సాకులు చూపి క్రూరంగా చంపుతున్నారు.

కుటుంబాన్నే చంపేస్తున్న రోజుల్లో ఫ్రెండ్ ఒక లెక్కా.?

గత ఏడాది ఢిల్లీ లో తనను గేమ్స్ ఆడుకోనివ్వట్లేదు, సరైన స్వేచ్ఛ లేదు అని తండ్రి తల్లి చెల్లెల్ని చంపాడు ఒక దుర్మార్గుడు. వాళ్ళని చంపడమే కాకుండా ఇంట్లో వాళ్ళని చంపింది దొంగలే అని చెప్పాడు, హాస్టల్లో ఉండే ఆ 20 ఏళ్ళ బాలుడు, ఇంటికి వచ్చాక రాత్రి 3 గంటలకి పధకం ప్రకారం తండ్రి ని తల్లిని కత్తి తో పొడిచి చంపాడు, ఆ తరువాత చెల్లెల్ని కూడా చంపాడు, కత్తి ని బాగా కడిగి ఎవరికి అనుమానం రాకుండా, తనకి కుడా గాయాలు చేసుకొని, చేసిందంతా దొంగలే అని చెప్పాడు. బాలుడి పైన అనుమానం తో విచారణ చెయ్యగా నిజం బయటపడింది. ఇంత కూడా కనికరం లేకుండా కన్న వాళ్ళని, సొంత చెల్లెల్ని చంపేశాడు. క్రూరత్వానికి నిదర్శనం గా ఇటీవల కాలం లో హత్య లు జరుగుతున్నాయి.

 

Comments

comments

Share this post

scroll to top