పట్టాలను వదిలి ప్లాట్ ఫాం మీద పరుగులు తీసిన ముంబాయ్ ట్రైన్!

బిల్డింగ్ లోకి విమానాలు దూసుకుపోతుంటే, ఇక్కడికి ట్రైన్స్ రావాని గ్యారెంటీ ఏంటి సార్ అని సంతోషం సిినిమాలో  నాగ్ తో బ్రహ్మీ పేల్చిన జోక్ గుర్తుందా! అదే నిజమైంది ముంబాయ్ లో….. ట్రాక్ మీద పరుగులు పెట్టాల్సిన ట్రైన్ ఒక్కసారిగా ఫ్లాట్ ఫాం మీదికెక్కింది. ఈ ఘటనతో భయపడ్డ ప్రయాణికులు ట్రైన్ నుండి కిందకు దూకి తలా ఓ దిక్కు పరిగెత్తారు, అసలు ఎం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది అక్కడ ఆసమయంలో….

TRAIN RUN IN PLOTFORM

చర్చిగేట్‌ రైల్వే స్టేషన్‌లోని మూడవ నెంబర్‌ ఫ్లాట్‌ఫాంకు వచ్చి ఆగాల్సిన  ముంబాయి లోకల్‌ ట్రైన్‌ ,  డ్రైవర్ అదుపుతప్పింది. దీంతో స్లో కావాల్సిన రైలు కాస్త అదే వేగంతో వెళ్లి డెడ్‌ ఎండ్‌ను ఢీ కొట్టింది. రక్షణగా ఏర్పాటు చేసిన బఫర్లను దాటి పట్టాలపైనుంచి ఫ్లాట్‌ఫాంపైకి వచ్చేసింది.

VIDEO:

CLICK: అల్లం పేస్ట్ తో చంపేస్తారు! జాగ్రత్త!!

ఈ ప్రమాదంలో ఐదుగురుకి స్వల్పగాయాలయ్యాయి.  ప్రమాద సమయంలో ఆ ఫ్లాట్‌ఫాంపై ఎవ్వరు లేకపోటంతో ప్రాణనష్టం తప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే అధికారులు, పోలీసులు అప్రమత్తయయ్యారు. సంఘటనకు కారణంగా భావిస్తూ లోకో ఇన్పెక్టర్‌ (డ్రైవర్‌), మోటర్‌మెన్‌, గార్డులను సస్పెండ్‌ చేశారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించారు.

 

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top