500 కిలోల బ‌రువున్న మ‌హిళ‌కు ఉచితంగా వైద్యం చేయ‌నున్న ముంబై వైద్యులు

అధిక బ‌రువు అనేది ఎవ‌రికైనా స‌మ‌స్యే. ఉండాల్సిన దాని క‌న్నా కొంచెం ఎక్కువ‌గా ఉంటేనే మ‌నం అడుగు తీసి అడుగు వేసేందుకు ఇబ్బంది ప‌డతాం. ఏ ప‌నీ చేయ‌లేం. ఎక్క‌డికి వెళ్లాల‌న్నా ఇబ్బందే. మ‌రి… కొన్ని వంద‌ల కిలోల బ‌రువు ఉంటే… ఇక అలాంటి వారి ప‌రిస్థితి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అలాంటి వారు ఇక లైఫ్ లాంగ్ బెడ్‌పై ఉండాల్సిందే. ఎన్నో అవ‌స్థ‌లు ప‌డాల్సిందే. ఆమె కూడా స‌రిగ్గా ఇలాంటి స్థితిలోనే ఉంది. అయితే… ఇక‌పై ఆమెకు ఆ అద‌న‌పు బరువు భారం త‌గ్గ‌నుంది. ఎందుకంటే… ఆమెకు ప‌లువురు వైద్యులు ఉచితంగా స‌ర్జ‌రీ చేయ‌నున్నారు. అందుకు గాను ఆ మ‌హిళ ఈజిప్టు నుంచి భార‌త్‌కు వ‌చ్చింది. అదీ… ప్ర‌త్యేక కార్గో విమానంలో..!

eman-ahmed

ఆమె పేరు ఈమ‌న్ అహ్మ‌ద్‌. వ‌య‌స్సు 36 సంవ‌త్స‌రాలు. బ‌రువు 500 కిలోలు. ఉంటోంది ఈజిప్టులో. అధిక బ‌రువు కార‌ణంగా ఈమ‌న్ గ‌త 25 సంవ‌త్స‌రాలుగా బెడ్‌పైనే ఉంది. దీంతో ఆమె ప్ర‌పంచంలోనే అత్య‌ధిక బ‌రువున్న మ‌హిళ‌గా గుర్తింపు పొందింది. ఈ క్ర‌మంలో ఆమెకు ఉచితంగా సర్జ‌రీ చేసేందుకు, అధిక బ‌రువు త‌గ్గించేందుకు ముంబైకి చెందిన డాక్ట‌ర్ ముఫ‌జ‌ల్ ల‌క్డావాలా ముందుకు వ‌చ్చారు. త‌న సైఫీ హాస్పిట‌ల్‌లో ఆమెకు ఈయ‌న బేరియాట్రిక్ స‌ర్జ‌రీ చేయ‌నున్నారు. ఈ క్ర‌మంలోనే ఈమ‌న్ ను త‌ర‌లించేందుకు ఈజిప్టు ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసింది. ఓ కార్గో విమానంలో ఆమెను వారు పంపారు. అయితే ఆమెను సేఫ్‌గా త‌ర‌లించేందుకు గాను ఇక్క‌డి నుంచి ఇద్ద‌రు వైద్యులు కూడా వెళ్లారు. వారు ఈమ‌న్ ప్ర‌యాణంలో ఆమెకు తోడుగా ఉండ‌డ‌మే కాదు, ఎమ‌ర్జెన్సీగా అవ‌స‌రం అయ్యే ప‌లు మెడిక‌ల్ సామ‌గ్రిని వెంట పెట్టుకుని ఈమ‌న్‌ను ఇండియాకు త‌ర‌లించారు.

ఈ క్ర‌మంలో ఆమె ముంబై చేరుకుంది కూడా. అయితే ఆమెను విమానం నుంచి ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన ట్ర‌క్‌లోకి ఎక్కించారు. అనంత‌రం ఆమెను హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. మ‌రో ఆరు నెల‌ల పాటు ఆమె ఇక్క‌డే ఉండ‌నుంది. ఈ ఆరు నెల‌ల్లో వైద్యులు ఆమెకు బేరియాట్రిక్ స‌ర్జ‌రీతోపాటు ప‌లు ఇత‌ర శ‌స్త్ర చికిత్స‌ల‌ను కూడా నిర్వ‌హించ‌నున్నారు. అందులో భాగంగా ఆమె బ‌రువు త‌గ్గేందుకు వైద్యులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ స‌ర్జరీలే కాదు, ఆమె వైద్యానికి అయ్యే ఖ‌ర్చును ఆ హాస్పిట‌ల్ వ‌ర్గాలే భ‌రించ‌నున్నాయి. ఆమెకు వారు ఉచితంగానే వైద్యం చేస్తున్నారు. ఏది ఏమైనా… ఈమ‌న్‌కు ఎదురైన ప‌రిస్థితి ఎవ‌రికీ ఎదురు కాకూడ‌దు క‌దా..!

Comments

comments

Share this post

scroll to top