థియేటర్ లోకి వాటర్ బాటిల్ అనుమతించనందుకు 11 వేల నష్టపరిహారం.

అది అగర్తలా లోని రూపసి మల్టిఫ్లెక్స్ థియేటర్…. సాయంకాలం సరదాగా  సినిమా చూద్దామని అందులోకి వెళ్లారు ముగ్గురు స్నేహితులు. టికెట్ తీసుకున్నారు. లైన్లో నిలబడి వెళుతున్నారు. వెంటనే సెక్యూరిటీ గార్డ్ వారిని ఆపి, మీ చేతిలోని వాటర్ బాటిల్ ఇక్కడ పడేసి వెళ్లండన్నాడు. అరెయ్ బాబు…..ఇది డ్రింకింగ్ వాటర్ బాటిల్, కావాలంటే తాగి చూడూ అన్నారు ముగ్గురు ప్రెండ్స్ . అయినా సెక్యూరిటీ గార్డ్ వారి మాటలను వినకుండా బాటిల్ ను లోపలికి అనుమతించనిచ్చేది లేదని ఖరాకండిగా చెప్పాడు. దీనిపై పెద్ద రచ్చే జరిగింది అక్కడ. లాస్ట్ కు మ్యాటర్ మేనేజర్ స్థాయికి వెళ్లింది.

మేనేజర్ కూడా సెక్యురిటీ కారణాల దృష్ట్యా బాటిల్ ను అనుమతించేది లేదని చెప్పాడు. దీంతో చేసేదేమి లేక బాటిల్ ను అక్కడ పడేసి సినిమా చూసి వచ్చారు ఆ ముగ్గురు స్నేహితులు.. మరుసటి రోజు వెంటనే జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమీషన్( NCRDC)  ను  కలిసి…ఓ కంప్లైంట్ ఇచ్చారు.

దీనిపై స్పందించిన కమీషన్,  పిటీషన్ దారులకు 11 వేలు చెల్లించాలంటూ సదరు థియేటర్ కు ఉత్తర్వులు జారీ చేసింది. వాటర్ బాటిల్ అనుమతించకపోవడానికి అసలు కారణం భద్రత కాదని, అదే థియేటర్ లో వారు  అధికరేట్లకు అమ్మే వాటర్ బాటిల్స్ ను కొనాలని చేయడమే దీని వెనుక అసలు ఉద్దేశ్యం అని తేల్చి చెప్పింది. థియేటర్స్ లోకి వాటర్ బాటిల్స్ ను అనుమతించాలని  అన్ని థియేటర్స్ కు ఉత్తర్వులిచ్చింది. ఒకవేళ తాగే నీటిని ఫ్రీగా అందించే థియేటర్స్ మాత్రం వాటర్ బాటిల్ తీసుకురావడం పై నిషేదాన్ని విధించవచ్చట.

నిజమే… మన దగ్గర కూడా చాలా థియేటర్స్ లో అవుడ్ సైడ్ ఫుడ్స్ ఆర్ నాట్ అలోవ్డ్ అంటూ  తాటికాయంత అక్షరాల్లో రాసి పెడతారు.. ఎమైనా అంటే భద్రత అంటారు. అది భద్రత కోసం కాదు వాళ్ల థియేటర్స్ క్యాంటీన్స్ ఫుల్ కలెక్షన్స్ కావడానికి వాల్లెంచుకున్న మార్కెటింగ్ స్ట్రాటజీ. మల్టీఫ్లెక్స్ ల ముక్కు పిండిన  ఆ ముగ్గురు కుర్రాళ్లని అభినందిద్దాం.. మనం ఇటువంటి వాటిని ప్రశ్నిద్దాం.

CLICK: నాలుగేళ్ల కుర్రాడు… అరకొర బట్టలేసుకునే వాళ్లందరికీ బుద్ది చెప్పాడు

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top