మల్టీ స్టార్టర్ మూవీలో రాజమౌళి హీరోలు..

రాజమౌళి వెండితెర జక్కన్న గా అందరికి సపరిచితమే .. రాజమౌళితో ఒక్క  సినిమా అయినా చేయాలని ఉవ్విళ్ళూరుతున్న హీరోల  లిస్ట్ కూడా పెద్దిగానే  ఉంది ఫిల్మ్ ఇండస్ట్రీలో.. అయితే ఇప్పుడు రాజమౌళి తో సినిమాలు చేసిన  ముగ్గురు నటులకు మంచి ఆఫర్ వచ్చింది.. హిందీ సినిమాను..తెలుగు లో కూడా చేయాలనుకుంటున్న ఆ చిత్రానికి సంబందించి వారిని అప్రోచ్ కూడా  అయినట్టు సమాచారం అందుతుంది.

 

rana prabhas ram charan

రాజమౌళి మగధీర తో రామ్ చరణ్ , బాహుబలితో రానా, ప్రభాస్ లకు  ఒక్కసారిగా  వండర్ ఫుల్ ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు వీరిని వెతుక్కుంటూ ఓ  బంపర్ ఆఫర్ వీరి తలుపు తట్టింది.  బాలీవుడ్ లో ఈ నెల 14 న  అక్షయ్ కుమార్ , సిద్దార్ధ్ మల్హోత్ర లు నటించిన బ్రదర్స్ చిత్రం విడుదల కానుంది.. ఈ చిత్రం ఎలాగైనా గట్టి విజయం సాధిస్తుంది అని నమ్మకంతో ఉన్నఆ సినిమా దర్శక నిర్మాతలు… అదే సినిమాను తెలుగు , తమిళం లో కూడా నిర్మించాలని అనుకుంటున్నారు.

తెలుగు కోసం…. ఇప్పటికే రామ్ చరణ్, ప్రభాస్, రానా లను ఆ సినిమా స్క్రిప్ట్ తో అప్రోచ్ అయినట్టు కూడా తెలుస్తోంది. రాజమౌళి తీర్చిదిద్దిన ఆ ముగ్గురిలో ఎవరో ఇద్దరు మాత్రం..ఆ సినిమాలో నటించే అవకాశాలు కనిపిస్తున్నాయ్.. అయితే రామ్ చరణ్ , ప్రభాస్ లు కలిసి నటిస్తారా లేక బాహుబలి పెయిర్ ను కంటిన్యూ చేస్తారా అనేది  చూడాలి!

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top