డ్రగ్స్ కేసు విషయంలో సీఎం “కెసిఆర్” సంచలన నిర్ణయం..! “అకున్” కు ఫోన్ చేసి ఏమన్నారో తెలుసా..?

రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ దందాపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. డ్రగ్స్ దందాతో సంబంధమున్న ఎవరినీ వదలొద్దని సీఎం కేసీఆర్… ఎక్సైజ్ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్‌కి తేల్చి చెప్పారు. శనివారం (జులై15) ఉదయం సీఎం… అకున్కు ఫోన్ చేశారు. సెలవులపై ఉన్న అకున్ సబర్వాల్ సీఎం సూచనతో తన సెలవులు వాయిదా వేసుకున్నారు. డ్రగ్స్ కేసు విచారణ కీలక దశలో ఉన్న సమయంలో సెలవులు పెట్టడం వల్ల ప్రభుత్వానికి, ఆయనకూ చెడ్డ పేరు వస్తుందని చెప్పడంతో అకున్ తన సెలవులను రద్దు చేసుకున్నట్లు తెలిసింది.

డ్రగ్స్ కేసులో ఎంతటి ప్రముఖులున్నా వదిలి పెట్టవద్దని సీఎం కేసీఆర్.. సబర్వాల్‌కు తేల్చి చెప్పారు. కేసులో ఉన్న వారందరి పేర్లను బయటపెట్టాలని ఆదేశించారు. ఎవరినీ కాపాడే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసులో మరొకరిని శనివారం(జులై15) పోలీసులు అరెస్ట్ చేశారు. ఏజీ కాలనీ నుంచి ఎక్సైజ్ ఆఫీసుకు తరలించారు. ప్రస్తుతం డ్రగ్స్ కేసులో మొత్తం అరెస్టైన వారి సంఖ్య 14కు చేరింది.

news source

Comments

comments

Share this post

scroll to top