ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల ఆస్తి ఉన్న ముఖేష్, అనిల్ అంబానీలు ఇద్ద‌రూ క‌లిసి ఒక‌ప్పుడు ఉన్న ఇల్లు ఏదో తెలుసా..?

రిల‌య‌న్స్ గ్రూప్‌. మ‌న దేశంలో చాలా పెద్ద కంపెనీ. ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీల‌కు ఈ కంపెనీలో వాటాలు ఉన్నాయి. కొన్ని కంపెనీలను ముఖేష్ చూసుకుంటే కొన్నింటిని అనిల్ చూసుకుంటాడు. తండ్రి ధీరూభాయ్ అంబానీ చ‌నిపోయాక వీరు ఆస్తుల‌ను పంచుకున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు వారు దేశంలోనే కాదు, ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌న‌వంతులైన జాబితాలో కొన‌సాగుతున్నారు. వంద‌ల ఫ్లోర్లు క‌లిగిన అపార్ట్‌మెంట్లు, విల్లాల్లో వారు నివాసం ఉంటున్నారు. కొన్ని ల‌క్ష‌ల కోట్ల‌కు వీరిద్ద‌రూ అధిప‌తులు. అయితే నిజానికి అంబానీల కుటుంబం ఒక‌ప్పుడు మ‌ధ్య‌త‌ర‌గ‌తి జీవ‌నం సాగించింది. ధీరూభాయ్ అంబానీ రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ స్థాపించ‌క ముందు వారు అంద‌రూ ఒకే ఇంట్లో ఉండేవారు. ఆ ఇల్లు ఏదంటే…

ముంబైలోని భులేశ్వ‌ర్స్‌, కొలాబా ప్రాంతాల్లో ఉన్న జై హింద్ ఎస్టేట్ క‌బూత‌ర్ ఖానాలోని అపార్ట్‌మెంట్లలో ఓ ఫ్లాట్‌లో వారి కుటుంబం నివాసం ఉండేది. ముఖేష్, అనిల్ అంబానీ స‌హా మొత్తం 7 మంది ఆ ఫ్లాట్‌లో ఉండేవారు. అది సింగిల్ బెడ్‌రూం ఫ్లాట్‌. అందులో ఉన్న‌ప్పుడు రోజూ ఉద్యోగం కోసం ముఖేష్‌, అనిల్ ఇద్ద‌రూ ఆర్టీసీ బ‌స్సుల్లో ప్ర‌యాణించేవారు. ఇక బ‌ట్ట‌లు కొనుక్కునేందుకు డ‌బ్బులు ఉండ‌క‌పోవ‌డంతో వారు అన్న‌ద‌మ్ములిద్దరూ బ‌ట్ట‌ల‌ను ఒక‌రివి ఒక‌రు మార్చుకుని వేసుకునేవారు.

ఈ క్ర‌మంలోనే 1966 వ సంవ‌త్స‌రంలో ధీరూభాయ్ అంబానీ రిల‌యన్స్ ఇండ‌స్ట్రీస్‌ను నెల‌కొల్పాడు. దీంతో వారి ద‌శ ఒక్క‌సారిగా తిరిగిపోయింది. అన‌తి కాలంలోనే ఆ కంపెనీ కోట్ల ట‌ర్నోవ‌ర్‌కు చేరుకుంది. దీంతో వారి లైఫ్ స్టైల్ మారిపోయింది. ఆ త‌రువాత నెమ్మ‌దిగా వారు విలాస‌వంత‌మైన భ‌వ‌నాలు, కార్ల‌లో ఉండ‌డం, తిర‌గ‌డం మొద‌లు పెట్టారు. ఇక ఇప్పుడైతే ముఖేష్, అనిల్ అంబానీల‌కు ప్ర‌త్యేకంగా పెద్ద పెద్ద భ‌వ‌నాలు ఉన్నాయి. ముఖేష్ అంబానీ నివాసంలోనైతే ఎప్పుడూ 600 మంది ప‌నిచేస్తారు. ఆ భ‌వంతి విలువ రూ.100 కోట్ల వ‌ర‌కు ఉంటుందని అంచ‌నా. ఇక అనిల్ అంబానీ ఇల్లు కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. దాన్ని సీవిండ్ అని పిలుస్తారు. అందులోనూ ఎన్నో వంద‌ల మంది ప‌నిచేస్తారు. ఏది ఏమైనా అలా అదృష్టం వ‌రించాల‌న్నా అంద‌రికీ రాసి పెట్టి ఉండాలి క‌దా..!

Comments

comments

Share this post

scroll to top