ముఖేష్ అంబానీ సోద‌రి అంత‌గా పాపుల‌ర్ అవ‌లేదు. ఎందుకో తెలుసా..? ఎవర్ని పెళ్లి చేసుకుందంటే..?

ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ.. ధీరూభాయ్ అంబానీ ఇద్ద‌రు కొడుకులు వీళ్లు. ధీరూభాయ్ అంబానీ అనంత‌రం వీరిద్ద‌రూ రిల‌య‌న్స్ వ్యాపారాల‌ను బాగా అభివృద్ధిలోకి తెచ్చి మంచి పేరు సంపాదించారు. అయితే ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. కానీ ధీరూభాయ్ అంబానీకి మ‌రో ఇద్ద‌రు కూతుళ్లు కూడా ఉన్నార‌ని మీకు తెలుసా..? అవును, ఉన్నారు. వారు ముఖేష్‌, అంబానీల‌కు సోద‌రిలు అవుతారు. కానీ అన్న‌దమ్ముళ్లు వెలుగులోకి వ‌చ్చినంత‌గా వారు జ‌నాల్లో పాపుల‌ర్ అవ‌లేదు. ఎందుకంటే..

అప్ప‌ట్లో.. అంటే.. 1978ల‌లో ధీరూభాయ్ అంబానీ కుటుంబం ముంబైలోని ఉషా కిర‌ణ్ అన‌బ‌డే అతి పెద్ద బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నంలో నివాసం ఉండేవారు. అందులో 22వ అంత‌స్తులో వారు నివ‌సించేవారు. అక్క‌డే ముఖేష్ అత‌ని సోద‌రుడు అనిల్‌, వారి సోదరిలు దీప్తి, నినా కొఠారిలు పెరిగారు. ఇక అదే భ‌వ‌నంలో 14వ ఫ్లోర్‌లో వాసుదేవ్‌ సాల్గౌక‌ర్ అనే మ‌రో వ్యాపార వేత్త ఉండేవాడు. అత‌ని కుటుంబం ఆ ఫ్లోర్‌లో నివాసం ఉండేది. ఇక సాల్గౌక‌ర్‌కు ద‌త్తరాజ్ అనే కుమారుడు ఉండేవాడు. వాసుదేవ్‌, ధీరూభాయ్ ఇద్ద‌రూ మంచి స్నేహితులు. దీంతో వారి కుటుంబాల మ‌ధ్య రాక‌పోక‌లు ఉండేవి. ఈ క్ర‌మంలో వారి కుమారులు ద‌త్త‌రాజ్‌, ముఖేష్ అంబానీలు కూడా స్నేహితులు అయ్యారు.

అయితే ఇరు కుటుంబాల మ‌ధ్య ఉన్న స్నేహం, రాక‌పోక‌లు కార‌ణంగా దత్త‌రాజ్‌, ముఖేష్ సోద‌రి దీప్తి ల మ‌ధ్య స్నేహం ఏర్ప‌డి అది కాస్తా ప్రేమ‌కు దారి తీసింది. చివ‌ర‌కు వారు పెళ్లి చేసుకున్నారు. అనంత‌రం ద‌త్త‌రాజ్‌, దీప్తిలు ఇద్ద‌రూ గోవాలోని ప‌నాజిలో హీరా విహార్ అనే మాన్ష‌న్‌లో ఉండ‌డం మొద‌లు పెట్టారు. అలా దీప్తి త‌న సోద‌రుల‌కు కొంత దూర‌మ‌వ‌డంతో ఆమె అంత‌గా వెలుగులోకి రాలేదు. అయితే పెళ్ల‌య్యాక దీప్తి పూర్తిగా గృహిణిగానే ఉండిపోయింది. కానీ భ‌ర్త ద‌త్త‌రాజ్ మాత్రం వ్యాపారంలో బాగానే సంపాదించాడు.

Comments

comments

Share this post

scroll to top