మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ గురించి తెలుసు కదా. ఈయన ఒకప్పుడు ప్రపంచంలోనే ధనవంతుడు. మైక్రోసాఫ్ట్ పీసీ కంపెనీ వల్ల ఈయన కొన్ని లక్షల కోట్లను ఆర్జించారు. అయితే ఈయన తన బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌తో తనకు వచ్చే డబ్బునంతా చారిటీ కోసమే ఉపయోగిస్తున్నాడు. ఈ క్రమంలోనే చాలా మంది బిల్‌గేట్స్‌ను దాటేసి ప్రపంచంలోనే అత్యధిక సంపద కలిగిన ధనవంతులుగా పేరుగాంచారు కూడా. వారిలో మన భారతీయ వ్యక్తి అయిన ముఖేష్ అంబానీ కూడా ఉన్నారు. ఈయన ఒకప్పుడు సంపదలో బిల్‌గేట్స్ కన్నా వెనుకబడి ఉండేవారు. కానీ వ్యాపారాల్లో బాగా లాభాలు రావడంతో ముఖేష్ అంబానీ బిల్ గేట్స్‌ను దాటేశారు.
బిల్‌గేట్స్‌కు 2007వ సంవత్సరంలో 62.29 బిలియన్ డాలర్ల ఆస్తి ఉండగా అదే ఏడాది ముఖేష్ అంబానీ ఆస్తి 63.2 బిలియన్ డాలర్లు అయింది. దీంతో ముఖేష్ బిల్‌గేట్స్‌ను దాటి అత్యధిక సంపద కలిగిన ధనవంతుడిగా పేరుగాంచారు. అయితే మీకు తెలుసా..? ముఖేష్ అంబానీకి అంత ఆస్తి రావడానికి కారణం ఏమిటో..? వాటిలో ఒకటి ఆయిల్ రిఫైనరీ. ఇది ప్రపంచంలోనే పెద్దది. దీంట్లో 1,240,000 బ్యారెల్స్ ఆయిల్ రోజూ శుద్ధి అవుతుంది. ఇక ఈయనకు ఉన్న మరో పెద్ద బిజినెస్ జియో. ప్రవేశపెట్టిన కేవలం 170 రోజుల్లోనే 10 కోట్ల మంది ఈ నెట్‌వర్క్‌లో చేరారు. అదేవిధంగా ముఖేష్ అంబానీ ఇల్లు విషయానికి వస్తే అది ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన అల్టామౌంట్ రోడ్లో ఉంది. ఆ ఇంటి పేరు Antilia. దీని ధర 100 కోట్ల డాలర్లు. ఇందులో 27 ఫోర్లు ఉంటాయి. మొత్తం 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటుంది. 168 కార్లను సులభంగా ఇందులో పార్క్ చేసుకోవచ్చు. అందుకోసం 6 అంతస్తులు ఉంటాయి. ఒక మినీ థియేటర్ ఉంటుంది. ఒకేసారి 50 మంది అందులో కూర్చోవచ్చు. ఒక మంచు గది (స్నో రూమ్), 3 హెలిపాడ్లు ఈ భవంతిలో ఉన్నాయి.
అయితే మన దేశానికి చెందిన కేవలం ముఖేష్ అంబానీ మాత్రమే కాదు, ఇతర దేశాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా బిల్ గేట్స్‌ను సంపదలో దాటేసి ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ సంపద కలిగిన ధనికుల జాబితాలో చేరారు. వారిలో Zara store chains వ్యవస్థాపకుడు Amancio Ortega (ఆస్తి 82.2 బిలియన్ డాలర్లు), అమెజాన్ ఈ-కామర్స్ పోర్టల్ వ్యవస్థాపకుడు Jeff Bezos (ఆస్తి 83.7 బిలియన్ డాలర్లు), Berkshire Hathway వ్యవస్థాపకుడు వారెన్ బఫెట్ (ఆస్తి 76.7 బిలియన్ డాలర్లు), మెక్సికోకు చెందిన వ్యాపార వేత్త Carlos Slim Helu (ఆస్తి 70.2 బిలియన్ డాలర్లు) లు ఉన్నారు. వీరందరూ ఆస్తిలో బిల్ గేట్స్‌ను దాటారు..!