ఘోరాతి ఘోరం.!: మొగుడితో గొడవ పడి పసిపాపతో పుట్టింటికి వెళుతుంటే ఆ తల్లిని ముగ్గురు కలిసి ఆటోలో…!

మన సమాజం ఎలాంటి స్థితికి వచ్చేసింది అంటే…ఆడవాళ్లను దైవంలా భావించే వాళ్ళు కొందరైతే…వారిని ఆటబొమ్మల్లా భావించి అత్యాచారం చేసేవారు మరికొందరు. ఒకపక్క అన్ని రంగాల్లో దేశం ముందుకి వెళుతుంది అని సంబరపడుతుంటే మరోపక్క ఆడవారిపై రోజురోజుకి అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. రోజుకి ఎన్నో రేప్ న్యూస్ లు వైన్ దౌర్భాగ్యంకి చేరుకున్నాము. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కొందరు మాత్రమే. పరువు పోతుందనే భయంతో ఎంతో మంది కంప్లైంట్ ఇవ్వకుండా బలయిపోతున్నారు. చివరికి పసి కందుని వదలట్లేదు. పసి పిల్ల తల్లిని కూడా వదలట్లేదు. ఇలాంటి ఓ దుర్ఘటన ఇటీవలే వెలుగులోకి వచ్చింది!

మే 29 న హర్యానా లోని గూర్గాన్ లో ఏ ఘటన చోటు చేసుకుంది. 23 ఏళ్ల వయసుగల యువతిపై ఆటోలో ముగ్గురు అత్యాచారం చేసారు. తొమ్మిది నెలల పసిపాప వారికి అడ్డొస్తుందని ఆటోలో నుండి బయటకి విసిరేశారు. ఆ పసిపాప మృతి చెందింది. ఆ యువతి అయిదు రోజుల తర్వాత అసలేం జరిగిందో పోలీసులకు వివరించింది! పోలీసులు వారిపై మర్డర్ కేసు మరియు అత్యాచారం కేసు బుక్ చేసారు. వివరాల్లోకి వెళితే..! ఆమె ఏం చెప్పింది అంటే!

“మాది మానేసర్ దగ్గర్లోని ఊరు. మే 29 న భర్తతో గొడవ పడ్డాను. నా కూతుర్ని తీస్కొని పుట్టింటికి వెళ్ళడానికి ఆటో ఎక్కాను. అప్పటికే అందులో ముగ్గురు మొగవాళ్ళు కూర్చొని ఉన్నారు. లోపలికి ఎక్కడదు అనుకున్నా…కానీ బలవంతంగా లోపలికి లాగేసారు. కన్సా రోడ్ రాగానే నన్ను ఎక్కడపడితే అక్కడ ముట్టుకోవడం మొదలుపెట్టారు. నేను తోసేస్తుంటే మరింతగా విరుచుకుపడి నా ఒళ్ళో ఉన్న నా పాపను బయటకి విసిరేశారు. వారికి నా పాప అడ్డొస్తుందని బయటకి విసిరేసి చంపేశారు. చివరికి నన్ను ముగ్గురు రేప్ చేసి ఓ చెత్తకుప్పలో పడేసారు. ఒకపక్క నా పాప అంతక్రియలు. మరోపక్క నాకు ఆపరేషన్. ఆ షాక్ తో అయిదు రోజులు నేను ఏం జరిగిందో పోలీసులకు వివరించలేదు”

Comments

comments

Share this post

scroll to top