సింగర్ ముద్దుపై స్పందించిన టీనేజ్ బాలిక..! ఈ రియాక్షన్ అస్సలూ ఊహించి ఉండరు.! ఏమనిందో తెలుసా.?

టివిలలో వచ్చే రియాల్టి షోలను చూసి తెగ ఎంజాయ్ చేస్తుంటాం..చిన్నపిల్లల రియాలిటి షోలకు కొదవే లేదు..అందులో వాళ్లు ముద్దుముద్దుగా పాటలు పాడుతుంటే,డ్యాన్స్ చేస్తుంటే చూసి మురిసిపోతాం.పట్టుమని పదేండ్లు కూడా లేని చిన్నారులు వారి హావభావాలు చూసి శభాష్ అనకుండా ఉండలేం…పిల్లలు చేసే చేష్టలకు ముద్దు చేస్తాం.కాని పిల్లల టాలెంట్ ని ఎంకరేజ్ చేయాల్సిన స్థానంలో ఉన్న వ్యక్తి మాత్రం పిల్లలతో విశృంకలంగా ప్రవర్తించడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది..పిల్లలపై చూపే కేరింగ్ కేవలం తెరమీదకే పరిమితం తెరవెనుక జరిగే రియాలిటి వేరు అని ప్రపంచానికి చూపించింది.

ప్రముఖ అస్సామీ సింగర్ పాపోన్.. హోలీపై ఓ రియాల్టీ షో చేశాడు. ఈ షోలో పాల్గొన్నది అందరూ చిన్న పిల్లలు. అందరి వయస్సు 13 ఏళ్ల లోపు అమ్మాయిలే. అందరికీ రంగులు పూస్తూ..పాటలు పాడుతూ గంతులేస్తున్న సింగర్ పాపన్ హడావిడి చేశాడు. చిన్నారుల ముఖాలపై రంగులు పూశాడు. అంతటితో ఆగలేదు. ముద్దులు పెట్టాడు. హోలీ రియాల్టీ షోకి జడ్జిగా వ్యవహరిస్తూ అనుచితంగా ప్రవర్తించాడు. ఈ షో ప్రమోషన్ కోసం.. కొంత భాగాన్ని తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు.ఆ పోస్ట్ లోని వీడియోలో ఓ అమ్మాయి ముఖంపై రంగు పూసి.. ముద్దు పెట్టాడు.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. చిన్న అమ్మాయిలతో ఇలా ప్రవర్తించటానికి సిగ్గులేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. బాలీవుడ్ సింగర్ పాపోన్ పై పోస్కో యాక్ట్ కింద ( మైనర్లపై లైంగిక వేధింపుల కింద) కేసు పెట్టారు.

ఈ నేపథ్యంలో ‘ది వాయిస్ ఇండియా కిడ్స్’ షోలో పాల్గొన్న 11 ఏళ్ల మైనర్ బాలిక మీడియా ముందుకు వచ్చింది. తల్లిదండ్రుల మాదిరిగానే ఆయన తనను ముద్దు పెట్టుకున్నారని స్పష్టం చేసింది. ‘‘పాపన్ సార్ చేసింది తప్పుగా అనుకుంటూ ఎవరూ అపార్థం చేసుకోవద్దు. ఆయన నన్ను చిన్నారిగానే చూస్తూ ఆత్మీయంగా మద్దుపెట్టుకున్నారు. ఈ విషయం అందరూ చూశారు. నా తల్లి, నా తండ్రి కూడా నన్ను అలాగే ముద్దాడతారు…’’ అని వివరణ ఇచ్చింది.

Comments

comments

Share this post

scroll to top