హస్యనటుడు M.S నారాయణ సతీమణి మరణం.

దివంగత హాస్యనటుడు ఎమ్ఎస్.నారాయణ సతీమణి కళాప్రపూర్ణ(63) సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. గత కొన్ని రోజులుగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న కళాప్రపూర్ణ సోమవారం జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఉదయం తుదిశ్వాస విడిచారు. 2015 జనవరి 23న ఎమ్ఎస్.నారాయణ గుండెపోటుతో లోకాన్ని విడిచివెళ్లారు. రెండు రోజులక్రితం ఆయన ప్రధమ వర్ధంతి కార్యక్రమాలను కుటుంబసభ్యులు నిర్వహించారు. ఏడాదికాలం వ్యవధిలోనే ఎమ్ఎస్ నారాయణ, ఆయన భార్య కనుమూయడంతో ఆ ఇంట్లో విషాధఛాయలు చోటుచేసుకున్నాయి.

1453696740-1467

ఎమ్ఎస్ నారాయణ భీమవరంలోని మూర్తి రాజు కాలేజ్ లో  చదువుకుంటున్న రోజులలో తన తోటి విద్యార్థిని అయిన కళాప్రపూర్ణను ప్రేమించాడు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం కావడంతో ఇంట్లో పెద్దలకు ప్రేమ విషయం చెప్పి, పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. అయితే కులాంతర వివాహానికి పెద్దలు అడ్డుచెప్పడంతో, అదే కాలేజ్ లో లెక్చరర్ గా పనిచేస్తున్న పరుచూరి గోపాలకృష్ణ  1972లో రిజిష్టర్ ఆఫీస్ లో వివాహం చేయించాడు. భీమవరంలోని మూర్తిరాజు హైస్కూల్లో ఎమ్ఎస్ నారాయణ, జూపూడి కేశవరావు హై స్కూల్ లో కళాప్రపూర్ణ తెలుగు అధ్యాపకులుగా పనిచేశారు. వీరికి కూతురు శశికిరణ్, తనయుడు విక్రం సంతానం. విక్రం నటుడిగా కొనసాగుతున్నాడు. శశికిరణ్ దర్శకురాలిగా అలరిస్తోంది.

MS-Narayana-Rare647x450

Comments

comments

Share this post

scroll to top