నిన్నటి “వెస్టిండీస్” మ్యాచ్ లో “ధోని” చేసిన స్టంప్ ఒక ఎత్తైతే..అతన్ని స్టంప్ అవుట్ చేయలేరని ప్రూవ్ చేయడం హైలైట్!

కెప్టెన్ కూల్ కీపింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. వికెట్ చూడకుండా స్టంప్ అవుట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. మెరుపు వేగంతో వికెట్లను గీరాటేయడం ధోనీకే చెల్లింది. బ్యాట్స్‌మెన్ క్రీజు వెలుపలికి షాట్ కోసం వెళ్లి.. పొరపాటున బంతి అతని బ్యాట్‌కి అందకపోతే ఇక అటే పెవిలియన్‌కి వెళ్లిపోవచ్చనే ముద్రపడిపోయింది. అలాంటి ధోనీని వెస్టిండీస్ యువ వికెట్ కీపర్ సాహి హోప్ స్టంపౌట్ చేసేందుకు విఫలయత్నం చేశాడు.

మూడో వన్డేలో ఇన్నింగ్స్ 41వ ఓవర్ వేసిన వెస్టిండీస్ స్పిన్నర్ బిషూ బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వెళ్లి షాట్ కొట్టేందుకు ధోనీ ప్రయత్నించాడు. కానీ.. షాట్‌ని పసిగట్టిన బిషూ తెలివిగా ఆఫ్ స్టంప్‌కి దూరంగా బంతిని విసిరాడు. అతను ఊహించినట్లే బంతి బ్యాట్స్‌మెన్‌కి అందకుండా వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లింది. కానీ.. స్టంపౌట్ ప్లాన్‌ని ముందుగానే పసిగట్టిన ధోనీ.. బంతి దూరంగా పడి అది వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లోలోపే క్రీజులోకి వచ్చేశాడు. స్టంపింగ్స్‌కి ఒక స్కూల్ పెడితే.. అందులో హెడ్‌మాస్టర్ ధోని.. అలాంటి ధోనీనే స్టంపౌట్ చేయగలరా..? అంటూ అభిమానులు తెగ కామెంట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ 93 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.

watch video here:

అంతేకాకుండా కీపింగ్ లో కూడా మరోసారి సత్తా చాటాడు ధోని. 20 వ ఓవర్ లో హోల్డర్ బాటింగ్ ఆడుతుండగా…కావాలని అశ్విన్ తో వైడ్ బాల్ వేయించాడు. బాట్స్మన్ ముందుకి వెళ్ళగానే బాల్ అందుకొని స్టంప్ అవుట్ చేసాడు ధోని. ఆ వీడియో మీరే చూడండి

watch video here:

https://twitter.com/lKR1088/status/880874871806447616

Comments

comments

Share this post

scroll to top