మైనస్ 45 డిగ్రీల ఉష్ణోగ్రత, 25 అడుగుల లోతు..6 రోజులుండి ప్రాణాలతో భయటపడ్డ సైనికుడు.

45 డిగ్రీల మైనస్ సెంటిగ్రేడ్ ల ఉష్ణోగ్రత,  25 అడుగుల లోతు  6 రోజులు…  ఎటువంటి ప్రమాదం లేకుండా బయటపడ్డాడు లాన్స్ నాయక్ హనుమంతప్ప. సముద్ర మట్టానికి 19వేల అడుగుల ఎత్తులో ఉండే సియాచిన్ ప్రాంతంలో వారంరోజుల క్రితం మంచు చరియలు విరిగిపడటంతో అక్కడ సరిహద్దు భద్రతావిధులు నిర్వహిస్తున్న 10 మంది సైనికులు చిక్కుకున్నారు. ఆ 10 మంది సైనికులలో లాన్స్ నాయక్ హనుమంతప్ప మాత్రమే సజీవంగా మిగిలాడు. ఇతను కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడ జిల్లాకు చెందినవాడు.

మంచు చరియల్లో పడి చిక్కుకున్న ఆ సైనికులను గుర్తించేందుకు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ , డాగ్ స్క్వాడ్స్, డ్రిల్లింగ్ మిషన్స్ ల  సహాయంతో ముమ్మరంగా ప్రయత్నించగా, రిస్క్ ఆపరేషన్ తర్వాత హనుమంతప్ప  మాత్రమే సజీవంగా ఉన్నాడని ఆర్మీ  అధికారులు తెలిపారు. మిగతా 9 మంది మరణించినట్లు తెలిపారు. అందరూ మృతి చెందగా, ఒక్క హనుమంతప్ప మాత్రమే సజీవంగా బ్రతకడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మితగా 9 మంది సైనికులు సుబీదర్ నగేష టిటి (కర్ణాటక, హసన్ జిల్లా, తేజ్పూర్ గ్రామం),హల్విదర్ ఎలుమలై. ఎం(తమిళనాడు, వేలూర్ జిల్లా, దుక్కుం పరై),లాన్స్ హల్విదర్ ఎస్.కుమార్ (తమిళనాడు,తేని జిల్లా, కుమనన్ తోజు),లాన్స్ నాయక్ సుధీష్ బి (కేరళ, కొల్లం జిల్లా, మోన్రోతురుత్తు),సిపాయ్ మహేశా పిఎన్ (కర్ణాటక, మైసూర్ జిల్లా,హెచ్ డి కోట్),సిపాయ్ రామమూర్తి ఎన్ (తమిళనాడు, కృష్ణగిరి జిల్లా,గుడిసతనపల్లి),సిపాయ్ గణేశన్ జి (తమిళనాడు, మదురై జిల్లా,చొక్కతేవన్ పట్టి),సిపాయ్ ముస్తఖ్ అహ్మద్ ఎస్ (ఆంధ్రప్రదేశ్,కర్నూల్ జిల్లా,పార్ణపల్లె),సిపాయ్ నర్సింగ్ సూర్యవంశీ ఎస్వి(మహారాష్ట్ర, సతర జిల్లా, మస్కరవడి) మంచు చరియలు విరిగిపడి మృతి చెందినవారుగా గుర్తించారు.

army-jawan-750x500

ఐతే 25 అడుగుల లోతులో, 45 డిగ్రీల ఉష్ణోగ్రతలో హనుమంతప్ప బ్రతకడానికి గల కారణం లేకపోలేదు. కొంత మేరకు మంచు తొలగించుకొని సహాయం కోసం ఎదురుచూడటం,సహజ సిద్ధంగా మంచులో గాలి వెళ్ళే చోటున ఉండటం, తను వేసుకున్న దుస్తులు శరీరాన్ని వెచ్చగా ఉండటం, అలాగే మూత్ర విసర్జన చేయకపోవడం వలన  ఒంట్లో వేడి నిలిచిపోతుంది. ఇలా హనుమంతప్ప బ్రతకడు. హనుమంతప్ప మృత్యుoజయుడు కాబట్టే ఆ మంచుగడ్డల మధ్య బ్రతకగలిగాడు. ప్రస్తుతం ఢిల్లీలోని ఆర్ఆర్ హాస్పిటల్ లో హనుమంతప్ప చికిత్స పొందుతున్నాడు. భద్రతావిధులు నిర్వహిస్తూ ప్రాణాలు వదిలిన ఆ 9 మంది సైనికులకు శ్రద్ధాంజలి ఘటిద్దాం.

Comments

comments

Share this post

scroll to top