SHOCKING NEWS: ఇద్దరు టీవీ సీరియల్ హీరోయిన్లు మృతి..! అసలు ఎలా జరిగింది..?

ఇద్దరు టీవీ నటులను బలి తీసుకుంది రోడ్డు. ఎన్నో సీరియల్స్ ద్వారా ఇంటింటికీ పరిచయం అయిన కన్నడ టీవీ నటి రచన (23), జీవన్ (25) కారు ప్రమాదంలో చనిపోయారు. కర్నాటకలో జరిగిన ఈ ఘోర ప్రమాదం టీవీ ఇండస్ట్రీని షాక్ కు గురి చేసింది. వివరాల్లోకి వెళితే.. మహానది, త్రివేణి సంగమ, మధుబాల సీరియల్స్ లో రచన లీడ్ రోల్ పోషించింది. నాలుగేళ్లుగా టీవీ సీరియల్స్ లో నటిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు సాధించింది. టీవీ షోలు కూడా చేస్తోంది. రచన తన టీవీ ఇండస్ట్రీలోని తన ఫ్రెండ్స్ అయిన జీవన్, ఉత్తమ్, కార్తీక్, ఎరిక్, రంజిత్, హోన్నెష్ తో కలిసి బెంగళూరు సమీపంలోని ఓ పుణ్యక్షేత్రానికి వెళ్లారు. ప్రత్యేక పూజలు చేశారు. అక్కడే కార్తీక్ బర్త్ డే సెలబ్రేషన్ కూడా చేశారు.

బుధవారం అంతా అక్కడే ఉన్న వీళ్లు.. గురువారం తెల్లవారుజామున సఫారీ కారులో బెంగళూరుకి బయలుదేరారు. మాగుడి తాలూకా సోలూరు దగ్గరకు రాగానే వేగంగా వస్తున్న వీరి కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో నటి రచన, జీవన్ అక్కడికక్కడే చనిపోయారు. మిగతా వాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలించారు. ఈ సమాచారంతో కన్నడ టీవీ ఇండస్ట్రీ షాక్ అయ్యింది. నాలుగు సీరియల్స్ లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న రచన మరణం తీరని లోటు అని సంతాపం ప్రకటించింది.

Comments

comments

Share this post

scroll to top