ఆమె మృత‌దేహానికి ద‌హ‌న కార్య‌క్ర‌మాలు జ‌రిపించాక‌, 27 రోజుల‌కు ఆమె మ‌ళ్లీ తిరిగి వ‌చ్చింది. షాకింగ్‌..!

ఎవ‌రికైనా త‌మ కుటుంబంలో ఉన్న ఎవ‌రైనా వ్య‌క్తి చ‌నిపోతే తీవ్ర‌మైన బాధ ఉంటుంది. దుఃఖం వ‌స్తుంది. అయిన‌ప్ప‌టికీ చ‌నిపోయిన వారి మృత‌దేహాల‌ను ఇంట్లో పెట్టుకోలేం క‌దా. ఖ‌న‌నం లేదా ద‌హ‌నం చేయాల్సిందే. అయితే ఆ త‌ల్లిదండ్రులు కూడా చ‌నిపోయింద‌ని చెప్పి త‌మ కూతురి మృత‌దేహాన్ని ద‌హనం చేశారు. త‌రువాత కొద్ది రోజుల‌కు కూతురు బ‌తికే ఉన్నానంటూ తిరిగి వ‌చ్చింది. దీంతో ఆ త‌ల్లిదండ్రుల‌కు ఒకేసారి ఆనందం, ఆశ్చ‌ర్యం క‌లిగాయి. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే…

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని గ్రేట‌ర్ నోయిడాలో రాజ్‌, స‌ర్వేష్ దంప‌తుల కుమార్తె నీతూకు, అదే ప్రాంతానికి చెందిన రామ‌ల‌క్ష్మ‌ణ్‌కు వివాహం అయింది. అయితే రాజ్‌, స‌ర్వేష్‌ల‌కు ఓ కిరాణా షాపు ఉండేది. అందులో నీతూ అప్పుడ‌ప్పుడు కూర్చునేది. ఈ క్ర‌మంలో నీతూకు, షాప్‌కు వ‌చ్చే పూర‌ణ్ అనే వ్య‌క్తికి మ‌ధ్య వివాహేత‌ర సంబంధం ఏర్ప‌డింది. దీంతో ఏప్రిల్ 6వ తేదీన నీతూ ఇంట్లో చెప్ప‌కుండా గ‌ప్ చిప్‌గా పూరణ్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి అక్క‌డే కాపురం పెట్టింది.

అయితే ఈ విష‌యం తెలియ‌ని నీతూ త‌ల్లిదండ్రులు రాజ్, స‌ర్వేష్‌లు నీతూను రామ‌ల‌క్ష్మ‌ణ్ చంపేసి మాయం చేశాడ‌ని భావించారు. అందుకు అనుగుణంగానే అత‌నిపై పోలీస్ కంప్ల‌యింట్ ఇచ్చారు. అయితే ఏప్రిల్ 24వ తేదీన తీవ్ర గాయాల‌తో గుర్తు ప‌ట్ట‌రాకుండా ఉన్న మృత‌దేహాన్ని చూసి రాజ్‌, స‌ర్వేష్ లు త‌మ కూతురు నీతూదే ఆ మృత‌దేహం అని భావించి అంత్య‌క్రియ‌లు చేశారు. త‌రువాత 27 రోజుల‌కు నీతూ తాను బ‌తికే ఉన్నాన‌ని చెబుతూ ఇంటికి తిరిగి వ‌చ్చింది. దీంతో నీతూ త‌ల్లిదండ్రులు అయోమ‌యానికి, ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. అయితే త‌మ కూతురు బ‌తికే ఉంద‌న్న విష‌యం తెలిశాక వారు సంతోషించారు. ఇక నీతూ బ‌తికే ఉంద‌ని తెలియ‌డంతో పోలీసులు కూడా ఆమె భ‌ర్త రామ‌ల‌క్ష్మ‌ణ్‌పై అత్త‌మామ పెట్టిన కేసును ఎత్తేశారు. ఈ క్ర‌మంలో వారు విచారించ‌గా నీతూ పురాణ్ వ‌ద్ద ఉండేందుకు వెళ్లింద‌ని తెలిసింది. అయితే నీతూదే అనుకుని ఆమె త‌ల్లిదండ్రులు ద‌హ‌నం చేసిన మృత‌దేహం ఎవ‌రిద‌నే విష‌యం మాత్రం పోలీసుల‌కు ఇంకా తెలియ‌లేదు. ఏది ఏమైనా.. ఇలాంటి కొన్ని సంఘ‌ట‌న‌లు మ‌న‌ల్ని కూడా షాక్‌కు గురి చేస్తాయి క‌దా..!

 

Comments

comments

Share this post

scroll to top