కామంతో క‌ళ్లు మూసుకుపోయిన ఆ మృగాళ్ల‌కు అమ్మాయిలు బుద్ధి చెప్పారు..!

నేటి త‌రుణంలో మ‌హిళ‌ల‌పై జరుగుతున్న అఘాయిత్యాలు, దాడులు అన్నీ ఇన్నీ కావు. ఈ మ‌ధ్య కాలంలో బాలిక‌ల‌పై అత్యాచార ఘ‌ట‌న‌లు పెరిగిపోయాయి. కామాంధులు న‌డిరోడ్డులోకి వ‌చ్చి రెచ్చి పోతున్నారు. అమ్మాయిలు రోడ్ల‌పైకి వ‌స్తే చాలు.. వారిని చూసి కామాంధుల‌కు క‌న్ను కుడుతుంది. ఈ క్ర‌మంలో వారిని ఏం చేయ‌డానికైనా కొంద‌రు ప్ర‌బుద్ధులు వెనుకాడ‌డం లేదు. తాజాగా మ‌రో రెండు ఘ‌ట‌నలు ఇలాంటివే జ‌రిగాయి. రెండు ఘ‌ట‌న‌ల్లోనూ అమ్మాయిలు ధైర్యంగా ముందుకు వ‌చ్చి ఎదిరించ‌డంతో మృగాళ్లు అరెస్ట‌య్యారు. ఇంత‌కీ అస‌లు జ‌రిగిన సంఘ‌ట‌న‌లు ఏమిటంటే…

మధ్యప్రదేశ్‌లోని భిండ్‌ ప్రాంతంలో అమ్మాయిల కోచింగ్ సెంటర్ వద్దకు ఓ యువకుడు వచ్చాడు. రాగానే సెల్ ఫోన్‌లో మాట్లాడుతున్నట్టు నటిస్తూ ప్యాంటూ విప్పి వికృత చర్యలకు పాల్పడ్డాడు. మొదట్లో అమ్మాయిలు పెద్దగా పట్టించుకోలేదు. మళ్లీ మరుసటి రోజూ అదే తంతు కొన‌సాగింది. దీంతో విసుగుచెందిన అమ్మాయిలు అతనికి స్థానికుల స‌హాయంతో తగిన బుద్ధి చెప్పారు. అత‌నికి దేహ‌శుద్ధి చేశారు. త‌రువాత అత‌న్ని పోలీసులకు అప్పగించారు. అతని వికృత చేష్టలు సీసీటీవీలో రికార్డ్ అవడంతో నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేప‌ట్టారు.

ఇక మ‌రో సంఘ‌ట‌న‌లో.. అసభ్యకరమైన మెసేజ్‌లు పంపి వేధిస్తున్న ప్రొఫెసర్‌ను రోడ్డుపైకి లాక్కొచ్చి ఉతికి ఆరేసిందో విద్యార్థిని. పంజాబ్‌లోని పాటియాలాలో ఉన్న‌ ప్రభుత్వ మహిళా కళాశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ క‌ళాశాల‌లో ప‌నిచేసే ఓ ప్రొఫెస‌ర్ ఓ విద్యార్థిని ఫోన్‌కు త‌ర‌చూ అసభ్యకరమైన మెసేజ్‌ల‌ను పంపి ఆమెను అత‌ను వేధించేవాడు. దీంతో ఆ యువ‌తి ఆ ప్రొఫెస‌ర్ పెడుతున్న ఇబ్బందుల‌ను త‌ట్టుకోలేక‌పోయింది. ఈ క్ర‌మంలోనే ఆమె త‌న తోటి విద్యార్థినులు, ఇత‌ర మ‌హిళా లెక్చ‌ర‌ర్ల‌తో క‌లిసి ఆ కీచ‌క ప్రొఫెస‌ర్ పీచ‌మ‌ణిచింది. అత‌న్ని న‌డిరోడ్డులోకి ఈడ్చుకువ‌చ్చి త‌గిన బుద్ధి చెప్పింది. అనంతరం పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా వారు ఆ ప్రొఫెస‌ర్‌ను అరెస్టు చేశారు. అవును, అలాంటి కీచ‌కుల‌కు అలా బుద్ధి చెప్పాల్సిందే. లేదంటే రెచ్చిపోతారు..!

https://m.dailyhunt.in/news/india/telugu/webduniya+telugu-epaper-telweb/madhyapradeshlo+koching+sentar+ala+cheshaadu+profesarnu+roddupaiki+laakkochhi-newsid-87294249?ss=pd&s=a

Comments

comments

Share this post

scroll to top