స్కానింగ్ మెషిన్ వల్ల మరణించిన యువకుడు…కారణం ఆక్సిజన్ సిలిండర్..! ఏమైందో తెలుస్తే షాక్.!

హాస్పిటల్స్‌లో ఒక్కోసారి వైద్యులు, సిబ్బంది చేసే చిన్నపాటి నిర్లక్ష్యాలే తరువాత పెద్ద మూల్యం చెల్లించుకునేలా చేస్తాయి. మనుషుల ప్రాణాలను తీసేలా చేస్తాయి. ఇప్పుడు మేం చెప్పబోయేది కూడా సరిగ్గా ఇలాంటి ఓ ఘటన గురించే. ఓ హాస్పిటల్‌లో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఎంఆర్‌ఐ మెషిన్‌లో చేయి ఇరుక్కుని ఓ వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన ముంబైలో చోటు చేసుకుంది.

ముంబైలోని బీఐఎల్ నాయర్ చారిటబుల్ హాస్పిటల్‌లో ఈనెల 27వ తేదీన సాయంత్రం రాజేష్ మారు అనే వ్యక్తి వృద్ధురాలికి అందిస్తున్న ఆక్సిజన్ సిలిండర్‌ను తీసుకొని ఎంఆర్‌ఐ స్కానింగ్‌ రూమ్‌ లోపలికి వెళ్లాడు. సాధారణంగా ఎమ్మారై స్కాన్ రూమ్‌లోకి మెటల్ వస్తువులను అనుమతించరు. అయితే అక్కడే ఉన్న వార్డు బాయ్ మెషీన్ ఆఫ్ చేసి ఉందని, ఏమీ కాదని చెప్పడంతో రాజేష్ ఆ ఆక్సిజన్ సిలిండర్‌ను లోపలికి తీసుకెళ్లాడు.

అలా రాజేష్‌ ఆక్సిజన్‌ సిలిండర్‌ను లోపలికి తీసుకెళ్లగానే మెషీన్ ఆన్ చేసే ఉండటంతో రాజేష్ అడుగుపెట్టగానే సిలిండర్ దానంతట అదే లీకవడం మొదలైంది. ఈ క్రమంలో ఎమ్మారై మెషీన్‌లోని అయస్కాంత క్షేత్రం సిలిండర్‌తోపాటు రాజేష్‌ను కూడా లోపలికి లాక్కుంది. ఫలితంగా అతని చేయి పూర్తిగా మెషీన్‌లో ఇరుక్కుపోయింది. దీంతో వెంటనే అక్కడే ఉన్న రాజేష్ బంధువులు, వార్డు బాయ్స్ అతన్ని ఎలాగోలా మెషీన్ నుంచి బయటకు తీశారు. అయితే అప్పటికే తీవ్రంగా రక్తం పోవడంతో వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు.

అలా రాజేష్‌ను ఐసీయూకు తరలించి చికిత్సనందిస్తుండగా పది నిమిషాలకు అతను మృతి చెందాడు. దీంతో రాజేష్ బావ హరీష్ సోలంకి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ క్రమంలో రాజేష్‌ బంధువుల ఫిర్యాదు మేరకు ఆసుపత్రిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే తమ అనుమతి లేకుండానే రాజేష్ ఆ ఆక్సిజన్ సిలిండర్‌ను లోనికి తీసుకెళ్లాడని ఆసుపత్రి వాళ్లు చెప్పగా, వార్డు బాయ్ సూచన మేరకే అతను వెళ్లాడని, అక్కడున్న డాక్టర్లు కూడా ఏమీ అడ్డు చెప్పలేదని హరీష్ సోలంకి తెలిపాడు. కాగా హాస్పిటల్ మేనేజ్‌మెంట్ నిర్లక్ష్యం వల్లే రాజేష్ చనిపోయాడని సోలంకి తెలిపాడు. ఏది ఏమైనా ఆస్పత్రి నిర్లక్ష్యం వల్లే రాజేష్‌ మృతి చెందాడని మనకు తెలుస్తుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సదరు ఆస్పత్రిపై మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలి.

Comments

comments

Share this post

scroll to top