మొదటి కమర్షియల్ హిట్ అందుకున్న అఖిల్?. Mr.మజ్ను రివ్యూ

అఖిల్ సినిమా తో ఎంట్రీ ఇచ్చాడు అఖిల్, ఆ చిత్రం తరువాత కొంచెం గ్యాప్ తీసుకొని హలో చిత్రం తో ముందుకు వచ్చాడు, ఆ చిత్రం బాగున్నా, కమర్షియల్ హిట్ కాలేకపోయింది. అమెరికా లో మాత్రం 1 మిలియన్ డాలర్లు కొల్లగొట్టింది హలో మూవీ, కమర్షియల్ హిట్ కాలేకున్నా ఒక డీసెంట్ మూవీ గా నిలిచిపోయింది హలో. ఇక అక్కినేని ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అఖిల్ పైన. అఖిల్ మొదటి చిత్రం అయిన అఖిల్ ఓపెనింగ్ డే రికార్డు ని ఇంత వరకు ఏ అక్కినేని హీరో కూడా దాటలేకపోయాడు అంటే అక్కినేని అభిమానులకు అఖిల్ అంటే ఎంత అభిమానమో అర్ధం అవుతుంది.

ఆశలు ఒమ్ము కాలేదు.. :

తొలిప్రేమ డైరెక్టర్ వెంకీ అట్లూరి Mr.మజ్ను సినిమాకి దర్శకత్వం వహించాడు, తొలిప్రేమ చిత్రం లో ఏ విధంగా అయితే లవ్ సీన్స్ ని ప్రెసెంట్ చేసాడో, ఈ సినిమాలో కూడా అదే విధంగా ప్రెసెంట్ చేసాడు, జనాలను ఆకట్టుకొనేలా, కనెక్ట్ అయ్యే సీన్స్ చాలానే ఉన్నాయ్ ఈ మూవీ లో. ముఖ్యంగా రొమాంటిక్ కామెడీ చాలా బాగా వర్క్ అవుట్ అయ్యింది.

డాన్స్ నుండి యాక్టింగ్ వరకు, అన్నిట్లో అఖిల్ ఈ సినిమాలో తన బెస్ట్ ఇచ్చాడు, ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో తన యాక్టింగ్ తో మాయ చేసాడు. హీరోయిన్ నిధి అగర్వాల్ క్యూట్ నెస్ కె కాదు, యాక్టింగ్ కి కూడా యూత్ ఫిదా అవ్వడం ఖాయం.

తమన్ ఏ వెన్నుముక్క.. :

పాటలు, నేపధ్య సంగీతం(BGM) తో సినిమాకి ప్రాణం పోసాడు తమన్, తొలిప్రేమ కి ఏ రకంగా అయితే వెన్నుముక్క అయ్యాడో, ఈ సినిమాలో కూడా వెంకీ అట్లూరి బలం గా మారాడు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయ్. సినిమాటోగ్రఫీ కూడా అద్భుతం.

చాలా రోజుల తరువాత అక్కినేని అభిమానులకి కాలర్ ఎగరేసి తిరిగే రోజొచ్చింది.

పాసిటివ్స్ :

అఖిల్ యాక్టింగ్
డ్యాన్స్
నిధి అగర్వాల్
1st హాఫ్
క్లైమాక్స్
స్క్రీన్ ప్లే
సాంగ్స్
నేపధ్య సంగీత

నెగిటివ్స్ :

సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్
స్టోరీ

Ap2TG రేటింగ్ : 3.5/5

Comments

comments

Share this post

scroll to top