M.P లు అయిన‌ప్ప‌టికీ…రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో స‌చిన్, రేఖ‌ల‌కు ఓటు హ‌క్కు లేదు ఎందుకో తెలుసా?

భార‌త ఎన్నిక‌ల సంఘం రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌ను తాజాగా నిర్వహించిన విష‌యం తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఉన్న లోక్‌స‌భ‌, రాజ్యస‌భ ఎంపీలు, ఆయా రాష్ట్రాల శాస‌న‌స‌భ‌ల‌కు చెందిన ఎమ్మెల్యేల‌ను రాష్ట్ర‌ప‌తిని ఎన్నుకునేందుకు ఓటు వేశారు. త్వ‌ర‌లో ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక కూడా జ‌ర‌గ‌నుంది. అయితే రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లో భాగంగా రాజ్య‌స‌భ ఎంపీలైన మాజీ క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్‌, న‌టి రేఖ‌లు ఓటు వేయ‌లేదు. వీరే కాదు, ఇలాగే రాజ్య‌స‌భకు చెందిన మ‌రో 10 మంది ఎంపీలు, ఇద్ద‌రు లోక్ స‌భ ఎంపీలు రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లో ఓటు వేయ‌లేదు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. అయితే వారు ఎందుకు ఓటు వేయలేక‌పోయారంటే..?

రాజ్య‌స‌భ‌లో 12 మందిని, లోక్‌స‌భ‌లో ఇద్ద‌రు ఆంగ్లో ఇండియ‌న్స్‌ను రాష్ట్ర‌ప‌తి ఎంపీలుగా నియ‌మిస్తారు. ఎప్ప‌టి నుంచో ఇలా నియామ‌కం చేప‌డుతున్నారు. కాగా ఇప్పుడు రాజ్య‌స‌భ‌లో ఎంపీలుగా కొన‌సాగుతున్న స‌చిన్ టెండుల్క‌ర్‌, రేఖ‌, బీజేపీ నాయ‌కుడు సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి, బాక్సర్ మేరీ కోమ్‌, న‌టుడు సురేష్ గోపి, రూపా గంగూలీ, న‌రేంద్ర జాద‌వ్‌, స్వ‌ప‌న్ దాస్ గుప్తా, కేటీఎస్ తుల‌సి, ప‌రాశ‌ర‌ణ్‌, అను ఆగా, శంభాజీ రాజెల‌ను గ‌తంలో రాష్ట్ర‌ప‌తే ఎంపీలుగా నియ‌మించారు. దీంతో వారు రాష్ట్ర‌ప‌తిని ఎన్నుకునేందుకు అర్హులు కాదు. స్వ‌యంగా రాష్ట్ర‌ప‌తే వారిని ఎంపీలుగా నియ‌మిస్తారు క‌నుక వారికి రాష్ట్ర‌ప‌తిని ఎన్నుకునే హ‌క్కు ఉండ‌దు.

మ‌న దేశంలో ఈ రూల్ ఎప్ప‌టినుంచో ఉంది. ఈ క్ర‌మంలోనే లోక్‌స‌భ‌కు చెందిన ఇద్ద‌రు ఎంపీలు, రాజ్య‌స‌భకు చెందిన 12 మంది క‌లిపి మొత్తం 14 మంది రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లో ఓటు వేయ‌లేదు. అదీ అస‌లు క‌థ‌. అంతేకానీ వారు రాలేక‌పోయో, మ‌రే ఇత‌ర కార‌ణాల వ‌ల్లో ఓటు వేయ‌లేదు అని అనుకునేరు. ఇక త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లో ఈ 14 మంది క‌లిపి మొత్తం ఉభ‌య స‌భ‌ల్లో ఉన్న 790 మంది ఎంపీలు ఉప‌రాష్ట్ర‌ప‌తిని ఎన్నుకుంటారు. అయితే ఈ ఎన్నిక‌లో ఎమ్మెల్యేల‌కు ఓటు వేసేందుకు అధికారం లేదు. కేవ‌లం ఎంపీలకు మాత్ర‌మే ఆ అర్హ‌త ఉంది.

Comments

comments

Share this post

scroll to top