వృత్తి మరవని ప్రజాప్రతినిధి…రోడ్డుపై యాక్సిడెంట్ అయితే కార్ ఆపి మరీ వైద్యం చేసిన M.P.

ఓ ఎం.పి తన కార్ లో రోడ్డు పై వెళుతున్నాడు. ఇంతలోనే అక్కడ ఓ చిన్న ప్రమాదం జరిగి ఓ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో కొట్టుకుంటున్నాడు. జనాలంతా గుమ్మి గూడి ఉన్నారు. ఎంటా అని ఆరా తీస్తే…ఎం.పి కి అసలు విషయం తెలసింది. ప్రమాదం జరిగి ఓ వ్యక్తి చావుబతుకుల మధ్య ఉన్నాడని….వెంటనే కార్ దిగిన M.P ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి ప్రథమ చికిత్స చేశారు. 108 కు ఫోన్ చేసి రప్పించారు. హుటాహుటిన వచ్చిన అంబులెన్స్ సదరు వ్యక్తిని హాస్పిటల్ కు చేర్చింది.

ప్రథమ చికిత్స చేసిన వ్యక్తి మరెవరో కాదు..భువనగిరి నుండి MP గా గెలిచిన బూర నర్సయ్య గౌడ్. గతంలో ఈయన డాక్టర్ గా పనిచేశారు. అందుకే వృత్తి విలువ తెలిసిన వాడు కాబట్టి….. అత్యంత అర్జంట్ పని ఉన్నప్పటికీ…కార్ ఆపి మరీ… ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి  ప్రథమ చికిత్సనందించారు.  ఇస్త్రీ చొక్క ఎక్కడ నలుగుతుందో అని ఆలోచించే  రాజకీయ నాయకులున్న ఈ రోజుల్లో… ఓ ఎం.పి స్వయంగా ఇలా బాధితుడికి  ప్రథమ చికిత్స అందించడం అభినందించదగ్గ విషయం.

#HatsOffToYouSir.

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top