ఇకపై “నాగిని” సీరియల్ లో “మౌని రాయ్” కనిపించదు…ఎందుకో తెలుసా.? ఆమె స్థానంలో నటించేది ఎవరంటే.?

మౌనీ రాయ్‌.. ఈ పేరు మ‌న దేశంలో ఉన్న చాలా మంది సినీ, టీవీ ప్రేక్ష‌కుల‌కు తెలుసు. అవును, ఎందుకంటే ఈమె నాగినిగా నాగిన్ సీరియ‌ల్‌లో న‌టించింది క‌దా. అందులో త‌న అందంతోపాటు న‌ట‌న‌తోనూ ఈమె మంచి మార్కులే కొట్టేసింది. ఈ క్ర‌మంలో కేవ‌లం హిందీలోనే కాక, ప‌లు ఇత‌ర భాష‌ల్లోకి కూడా ఈ సీరియ‌ల్ డ‌బ్ అయింది. దీంతో మౌనీ రాయ్‌కు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు వ‌చ్చింది. అయితే అదే గుర్తింపు కార‌ణంగా ఇప్పుడీమెకు సినిమాల్లో ఆఫ‌ర్లు కూడా వ‌స్తున్నాయి.

మౌనీ రాయ్ కు సినిమాల్లో ఆఫ‌ర్లు రావ‌డం ఏమో గానీ ఇప్పుడు తాను చాలా బిజీ అయింది. దీంతో నాగిన్ సీరియ‌ల్ లో ఈమె న‌టించ‌బోవ‌డం లేదు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. నాగిన్ రెండు సీజ‌న్ల‌లోనూ మౌనీ రాయ్ నాగినిగా న‌టించింది. కానీ త్వ‌రలో రానున్న నాగిన్ 3వ సీజ‌న్‌లో నాగినిగా మౌనీ రాయ్ న‌టించ‌డం లేదు. మ‌రి ఆమె బ‌దులుగా ఎవ‌రు వ‌స్తున్నార‌నేగా మీ డౌట్‌. ఇంకెవ‌రు.. ఆమె స్థానంలో వ‌స్తున్న‌ది సుర‌భి జ్యోతి.

సుర‌భి జ్యోతి కూడా మౌనీ రాయ్‌లాగే మంచి న‌టిగా పేరు తెచ్చుకుంది. కుబూల్ హై, కోయి లౌట్ కే ఆయా హై వంటి సీరియ‌ల్స్ లో ఈమె న‌టించి మంచి పేరు తెచ్చుకుంది. దీంతో ఈమెను ఇప్పుడు నాగిన్ 3 సీజ‌న్ కోసం నిర్మాత ఏక్తా క‌పూర్ ఎంపిక చేసింది. ఇక మ‌రో పాత్ర అయిన ఆదా ఖాన్ కు బ‌దులుగా అనిత హ‌స్సా నందిని అనే మ‌రో భామ న‌టించ‌నుంది. ఈ క్ర‌మంలో కొత్త నాగిన్ సిరీస్ త్వ‌ర‌లో ప్ర‌సారం కానుంది. చూద్దాం మ‌రి.. కొత్త న‌టుల‌తో నాగిన్ 3 ఎలా ఉంటుందో. ఏది ఏమైనా మౌనీ రాయ్ నాగిన్‌లో ఇక న‌టించ‌డం లేదు అని తెలిసే స‌రికి చాలా మంది ఆమె అభిమానులు ఒకింత నిరాశ‌కు గుర‌వుతున్నారు. అవును మ‌రి, ఆమె అంత‌లా జ‌నాల‌ను ఆక‌ట్టుకుంది క‌దా..!

Comments

comments

Share this post

scroll to top