“మొట్ట మొదటిసారి” అంటూ..టెంక్షన్ పుట్టించిన షార్ట్ ఫిల్మ్.

100 నెంబర్ కు కాల్…సార్…ఇక్కడ మర్డర్ జరిగిందంటూ పోలీసులకు ఫోన్….వరుస హత్యలు..  అంతా అయోమయం…? ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారని పోలీసుల శోధనలు… అంతా టెంక్షన్ టెంక్షన్…అయోమయం, అంతుచిక్కని ట్విస్టులు ఇలా… టైటిల్ పడింది మొదలు, ఎండ్ కార్డ్ పడే వరకు దాదాపు  35 నిమిషాల పాటు మన మనసుల్ని, మన మెదడుని తన ఆధీనంలోకి తీసుకొని మరీ మన చేత  తన సినిమా చూసేలా చేశాడు… ఈ దర్శకుడు. ఒక్క సెకండ్ మిస్ అయితే ఏం జరిగిపోతోందో అనే టెంక్షన్ తో.. ప్రేక్షకుడు తన దృష్టిని మరల్చే గ్యాప్ కూడా ఇవ్వకుండా తన సినిమాతో కట్టిపడేశాడీ ఈ యువ లఘుచిత్రాల దర్శకుడు. వైవిధ్యమైన తన  షార్ట్ ఫిల్మ్స్ తో యూత్ ను ఆకట్టుకుంటున్న అజయ్….తీసిన మరో కొత్త షార్టీనే …మొట్టమొదటిసారి……ప్రతిసారీ కొత్త కథతో ప్రేక్షకులను ఆకట్టుకునే అజయ్….ఈ సారి థ్రిల్లర్ స్టోరితో ఈ లఘుచిత్రాన్ని తెరకెక్కించాడు.

కథ, కథనం గురించి కాస్తంత పక్కకు పెడితే…..టైటిల్స్ పడే దగ్గరి నుండి ఎండ్ కార్డ్ పడే వరకు…ఇది షార్ట్ ఫిల్మ్ అనే భావన ఎక్కడా రాలేదు…..ముఖ్యంగా సాంకేతికత పరంగా, క్వాలిటీ పరంగా ఓ ఫుల్ లెంగ్త్ మూవీని తలపించింది.  బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, కొన్ని సన్నివేశాల చిత్రీకరణలో కెమెరా వర్క్…..కథతో పాటు క్యారీ అయ్యేలా చేస్తూనే మరింత టెంక్షన్ కు గురిచేశాయ్. ఇక కథ పరంగా కాస్తంత కన్ ప్యూజన్ ఉన్నప్పటికీ..టేకింగ్ లో, సస్పెన్స్ ను అలాగే కొనసాగించడంలో….రామ్ గోపాల్ వర్మ ను మరపించాడు ఈ యంగ్ డైరెక్టర్. ఈ సినిమాలోని  గౌతమ్ పాత్ర అమితంగా ఆకట్టుకుంది. యస్…మన షార్ట్ ఫిల్మ్స్ పెద్ద సినిమాలను మించిపోతున్నాయ్ అనే మాటలను నిజం చేస్తుంది ఈ సినిమా టేకింగ్.

Watch Motta Modatisari Short Film:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top