మోత్కుపల్లి టిడిపిని వీడనున్నారా?

మోత్కుపల్లి  టిడిపి లో ఫైర్  బ్రాండ్  లాంటి  వారు, రేవంత్ తర్వాత కెసిఆర్ ను తన వాగ్థాటి తో ముప్పుతిప్పలు పెట్టే నాయకుడతను, కానీ ఇప్పుడు ఆ వాయిస్ సైలెంట్ అయ్యింది. అసలే నోటు కు ఓటు వ్యవహారం  అధినేత మెడకు చుట్టుకుంటున్న తరుణంలో  ఎదుర్కోడానికి   తెలంగాణ తెలుగు తమ్ముళ్ళలో ఎవరూ ముందుకు రావడం లేదు. ఎటాకింగ్ లో ముందుండే మోత్కుపల్లి నర్సింహులు కూడా క్రూసియల్ టైంలో కనబడకుండా పోయారు.

kcr-Motkupalli-Narasimhulu

 

మోత్కుపల్లి మౌనం  వెనుక మరో కారణం ఉందనే పుకార్లు వినిపిస్తున్నాయ్ , కడియం శ్రీహరి రాజీనామాతో ఖాళీ అయిన వరంగల్ ఎంపి స్థానానికి మోత్కుపల్లి   TRS నుండి పోటీ చేస్తారనే వార్తలు గట్టిగా  వినిపిస్తున్నాయి. దీనికి స్కోప్ కూడా ఉందనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు . గతంలో టిడిపి నుండి ఎమ్మెల్సీ పదవి ఇస్తారని, ఏకంగా మోత్కుపల్లిని గవర్నర్ ను చేస్తారనే వార్తలు వినిపించాయ్. కానీ అవేవీ లభించకపోవడంతో మోత్కుపల్లి అసంతృప్తితో ఉన్నారట, అందుకే ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చట!

గతంలో కెసిఆర్ పై మండిపడ్డ మోత్కెపల్లి  వీడియో:

ఇదే నిజమైతే తెలంగాణ లో టిడిపి వాయిస్ ఉన్న లీడర్ను కోల్పోయినట్టే…

CLICK : నడిరోడ్డు పై రానా

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top