టూత్ పేస్ట్, గుడ్డులతో…. ముఖం మీది మొటిమలు, మచ్చలు తొలగించొచ్చని తెలుసా??

టీనేజ్ లో అమ్మాయిలను ఎక్కువగా వేధించే సమస్య పింపుల్స్.పింపుల్స్ మొఖంపైనే కాదు మెడ ,భుజం,వీపుపైన కూడా వస్తుంటాయి.యవ్వనంలో హార్మోన్ల సమతుల్య లోపం వలన గ్రంధుల నుండి సెబమ్ అనే ఆయిల్ రిలీజ్ అయి అది మొటిమలకు దారితీస్తుంది. అందంగా మెరిసిపోవాల్సిన మోముపై చిన్న మొటిమ వస్తే.. అమ్మాయిల కంగారు అంతాఇంతా కాదు. అది తగ్గేదాకా రకరకాల చికిత్సలు ప్రయత్నిస్తారు..మొటిమలు,మొటిమలు పగిలాక ఏర్పడే నల్లమచ్చలకు ఒకే ఒక నైట్ లో చెక్ చెప్పొచ్చు.దానికోసం మీరు చేయాల్సింది.

మనం రోజు ఉదయాన వాడే టూత్‌పేస్ట్ దంతాలను మెరిసేలా మాత్రమేకాదు ఇతర లాభాలను కూడాచేకురుస్తుంది. టూత్‌పేస్ట్ మొటిమలను కూడా తగ్గిస్తుంది. దీనికి చేయాల్సిందల్లా ఏంటంటే నైట్ ఫేస్ ని నీట్ గా కడుక్కుని వైట్ టూత్‌పేస్ట్ ను మొటిమలపై అప్లై చేసి అలాగే ఉంచాలి. ఇలా చేయటం వలన మొటిమల వలన కలిగిన వాపులుతగ్గుతాయి.

paste

స్టీం ట్రీట్మెంట్ ముఖానికి చాలా మంచిది ఎందుకంటే ఇది చర్మ రంద్రాలను తెరచి, చర్మం శ్వాస తీసుకునేలా చేస్తుంది. ఒక పెద్ద కంటెయినర్ ను తీసుకొని, అందులో కొన్ని వేడి నీటిని కలపండి. ఈ నీటి నుండి వచ్చే నీటి ఆవిరి మీ ముఖానికి తగిలే విధంగా కొద్ది సేపు ఉండండి. తరువాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపర్చుకొండి.

steem
ప్రోటీన్ లతో నిండి ఉండే గుడ్డుసొన మొటిమలను తగ్గించటమే కాదు ముఖ చర్మంపై ఉండే అవాంఛిత మరకలను మరియు వాపులను తొలగిస్తుంది. 3 గుడ్ల నుండి తెల్లసొనను తీసుకొని, 3 నిమిషాల పాటూ అలాగే ఉంచండి. ఒకసారి తెల్ల సొన సెట్ అయిన తరువాత, మొటిమలు ఉన్న ప్రాంతంలో చేతి వేళ్ళతో దీనిని అప్లై చేయండి. ఎండే వరకు వేచిఉండి, గోరు వెచ్చని నీటితో కడిగివేయండి. ఇలా రోజులో 4 సార్లు చేయటం వలన మొటిమల నుండి ఉపశమనం పొందొచ్చు.చేతులకు గుడ్డుతెల్ల సొన అప్లై చేసుకుంటే చేతేలపై మురికిపొయి నలుపుదనం తగ్గుతుంది.

egg
యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ సెప్టిక్ మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉండే అల్లం మొటిమలను తగ్గించే సమర్థవంతమైన సహజ ఔషదంగా పేర్కొనవచ్చు. అల్లంలో ఉండే సల్ఫర్ మొటిమలను నయం చేసే గుణాలను కలిగి ఉంటుంది. ఒక అల్లం ముక్కను తీసుకొని, 5 నుండి 7 నిమిషాల పాటూ ప్రభావిత ప్రాంతాలలో అప్లై చేయండి. తరువాత నీటితో కడిగి మళ్ళి అల్లం ముక్కను ఉంచండి. ఇలా తరచుగా చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు.

ginger
మొటిమలు మరియు వాటి వలన కలిగే ఎరుపుదనం, వాపులు మరియు ఇన్ఫ్లమేషన్ వంటి వాటిని ఐస్ థెరపీ ద్వారా త్వరగా తగ్గించుకోవచ్చు. ఈ థెరపీ వలన రక్త ప్రసరణ మెరుగుపడటమే కాదు, శ్వేధ గ్రంధులను కూడా గట్టి పరుస్తుంది. దీనితో పాటుగా, చర్మంపై ఉండే దుమ్ము, ధూళి మరియు నూనెలను తొలగించుటకు సహాయపడుతుంది. చిన్న మంచు గడ్డను బట్టలో చుట్టి, మొటిమలు ఉన్న ప్రదేశంలో కొన్ని సెకన్ల పాటూ ఉంచండి. ఇలా కొన్ని సార్లు చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు.

ice
టాల్కం పౌడర్ కూడా మొటిమలను నివారిస్తుంది.రాత్రి పూట పడుకునే ముందు మోఖాన్ని నీట్ గా కడుకుని మొటిమలు ఉన్న ప్లేస్ లో టాల్కం పౌడర్ ను ముద్దగా అప్లై చేయాలి.

powder

Comments

comments

Share this post

scroll to top