అమ్మా. అమ్మా. నీ పసివాణ్ణమ్మా. అమ్మ పాట అదుర్స్ !!!

పెదవే పలికిన మాటల్లోనే తియ్యని పాటే అమ్మా, కదిలే దేవత అమ్మా ,కంటికి వెలుగమ్మా అని పాడుకున్నా??
ఎవరు రాయగలరు అమ్మా అని మాట కన్నా తియ్యని పాట అని పొగిడినా…. అది అమ్మకే చెల్లు…
మాతృ దినోత్సవం సందర్భంగా అమ్మకు అల్టిమేట్ పాటల నీరాజనాలు అందిద్దాం..!!

సృష్టి కర్త బ్రహ్మ, అతనిని సృష్టించినది ఒక అమ్మ అనే పాట లో కన్న కోడికు చేతిలోనే నిర్లక్ష్యానికి గురి కాబడుతున్న తల్లుల దైన్యాన్ని వివరించారు.

Raghuvaran B Tech Telugu Movie Stills

Raghuvaran B Tech Telugu Movie Stills

పెదవే పలికిన మాటలల్లోనే అంటూ అమ్మ ప్రేమ మాధుర్యాన్ని మాటల్లో వినిపించారు.
ఎవరు రాయగలరు అంటూ అమ్మ పేరు లోని గొప్పదనాన్ని కళ్ళకు కట్టారు.

ఏ చోట ఉన్నా నీ ధ్యాసలోన…

అమ్మ ఉండలేదు. తన పిల్లలను వదిలి ఉండలేదు. వారికి దూరమయ్యి దూరలోకాల్లో అయినా సరే మనలేదు. అందుకే పరిగెత్తుకుని వచ్చేస్తుంది. తను కన్న సంతానం కడుపులో తిరిగి అమ్మైపుడుతుంది. అమ్మ రుణం తీర్చుకోగలిగాము అనేది పిచ్చిమాట. అమ్మ రుణం తీరదు. దోసిళ్లలోని మట్టితో నది నీరు ఎండదు.కలతను రానీకు కన్నంచున  కసిరే శిశిరాన్ని వెలివేసి త్వరలోన

చిగురై నిను చేరనా …

అమ్మ పాటలు చాలా వచ్చాయి. కాని అమ్మ కోసం కొడుకు, కొడుకు కోసం అమ్మ తమ పాశాన్ని వ్యక్తం చేసిన ఇటీవలి పాట ఇది. తెలుగువారు ఇటువంటి సెంటిమెంట్లకు నవ్విపోయే స్థితిలో ఉన్నారు. తమిళలు ఇంకా తమ సున్నితత్వాన్ని కోల్పోకుండా ఉన్నారు. అందుకు అమ్మ మోములాంటి ఈ అందమైన పాటే తార్కాణం.

మథర్స్ డే సందర్భంగా టాప్ మథర్స్ సాంగ్స్ లింక్ కింద ఇచ్చాం…. అమ్మకు పాటాభిషేకం.

Happy Mothers day to all.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top