బిడ్డ కోసం చిరుతతో అరగంట పాటు పోరాటం చేసిన తల్లి…. చివరకు తన బిడ్డను పులి బారినుండి కాపాడుకుంది.

లక్నో లోని  కాట్రాయన్ ఘాట్ గ్రామానికి చెందిన ఫూల్మతి (30) తన ఇద్దరు ఆడబిడ్డల్ని తీసుకుని పొలానికి బయలుదేరింది. పూల్ మతి పొలం పనుల్లో నిమగ్నం అయిన సమయంలో సడెన్ గా వచ్చిన చిరుత నాలుగేళ్ళ పూల్ మతి కూతురు  గుడియాను నోట కరుచుకొని తీసుకుపోవడానికి ప్రయత్నించింది. అది చూసిన పూల్ మతి..పెద్ద ఎత్తున కేకలు వేసింది.. అప్పుడు సమయం ఉదయం 8  కావడంతో ఇంక ఎవరూ పొలం పనులలోకి రాలేదు. అయినా పూల్ మతి తన బిడ్డను కాపాడుకోవడం కోసం…తన చేతికి దొరికిన రాళ్ళు, కర్రలను చిరుత మీదికి విసిరుతూనే ఉంది. ఇలా ఓ అరగంట పాటు కేకలు వేయడం, రాళ్లతో కొట్టడం చేస్తూనే ఉంది.

51449661037_625x300

చివరకు పూల్ మతి కుటుంబ సభ్యులు రావడంతో అందరూ కలిసి చిరుతపైకి కట్టెలతో దాడి చేయబోయారు..అందర్నీ ఒక్కసారిగా చూసిన చిరుత బెదిరిపోయి… నోట కరుచుకున్న పిల్లాడిని అక్కడే వదిలి అడవిలోకి పారిపోయింది. ఈ దాడిలో గుడియాతో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో దావానంలా షేర్ అవుతూ ఉంది… తల్లికి బిడ్డలను  ప్రేమించడమే కాదు, తన పిల్లలకు ఏదైనా జరిగితే తిరగబడడంలో ప్రాణాలకు సైతం వెనకాడరని మరోమారు నిరూపితం అయ్యింది.

అమ్మ ప్రేమకు, పోరాటానికి వందనం.

Source: సాక్షి.

Comments

comments

Share this post

scroll to top