నీచమైన ఘటన.. దళిత మహిళ అని చెప్పి ట్రెయిన్‌లో కింద కూర్చోబెట్టారు..!

మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. ఆధునిక సాంకేతిక ఫలాలను అనుభవిస్తున్నాం. ఎన్నో రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్నాం. ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నాం. అంతా బాగానే ఉంది. కానీ కొన్ని విషయాల్లో మాత్రం ఇంకా వెనుక బడే ఉన్నాం. సాంఘిక దురాచారాలను రూపు మాపే విషయంలో మనం ఇప్పటికీ ఇంకా అంధ యుగంలోనే ఉన్నాం. కానీ మారి ముందుకు వెళ్లడం లేదు. ఢిల్లీ మెట్రోలో జరిగిన ఓ సంఘటన గురించి తెలిస్తే మీరు కూడా ఇదే అంటారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే…

ఢిల్లీ మెట్రో రైలులో ఈ మధ్యే ఓ నీచమైన చర్య జరిగింది. ఓ మహిళ తన బాబుతో ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణిస్తోంది. అయితే ఆ బాలుడి సంరక్షణ కోసం ఆ మహిళ నియమించుకున్న ఆయా మాత్రం మెట్రోలో వారి పక్కన సీట్‌లో కాకుండా కింద కూర్చుంది. సీట్లు ఖాళీగా లేవా.. అంటే.. కాదు.. ఒక్క మనిషికి ఇంకా స్థలం ఉంది. నిక్షేపంగా కూర్చోవచ్చు. అయినప్పటికీ ఆ ఆయా కిందే కూర్చుంది. అందుకు కారణం ఆ మహిళ ధనికురాలు కావడం, ఆయా పేదరాలు కావడం, దళిత మహిళ కావడమే.

కాగా ఆ ఆయా అలా కూర్చుని ఉన్నప్పుడు ఎవరో ఆమెను ఫొటో తీసి నెట్‌లో పెట్టారు. దీంతో సోషల్‌ మీడియాలో ఇప్పుడా ఫొటో వైరల్‌ అవుతోంది. సదరు మహిళ ఆ ఆయా పట్ల చూపించిన వివక్షకు నెటిజన్లందరూ ఆ మహిళను విమర్శిస్తున్నారు. మనం ఆధునిక యుగంలో ఉన్నామా, అంధ యుగంలో ఉన్నామా… మన మైండ్‌ సెట్‌ మారాలి.. ఇలాంటి చర్యలు చాలా నీచమైనవి.. అంటూ అందరూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా మన సమాజంలో ఇంకా కుల, ధనిక, పేద వివక్షలు ఇంకా వేళ్లూనుకునే ఉన్నాయడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి ఘటనలు ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో కదా..!

Comments

comments

Share this post

scroll to top