కోమాలో ఉన్న తల్లిని స్పృ హలోకి తెచ్చిన పసిపాప ఏడుపు.

వైద్యశాస్త్రానికి అంతుచిక్కని అద్భుతం ఇది. తల్లికి బిడ్డకు మధ్య ఉన్న అనుబందపు అద్భుతానికి వైద్యశాస్త్రమే అవాక్కయిన ఘటన ఇది . కరోలియాలోని ఓ హాస్పిటల్ లో పురిటి నొప్పులతో చేరింది షెల్లి. తొలికాన్పు, పైగా నొప్పులు ఎక్కువవుతున్నాయ్. ఆ నొప్పులను భరించలేక కోమాలోకి వెళ్లింది షెల్లి. డాక్టర్లకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. డాక్టర్ల బృందమంతా నాలుగు గంటల పాటు శ్రమించి ఆపరేషన్ చేసి బిడ్డను బయటికితీశారు. పండంటి బిడ్డ పుట్టినా చూసుకోలేని స్థితిలో తల్లి , పాప పుట్టిందని సంతోషించాలో..లేక భార్య కోమాలో ఉందని బాధపడాలో తెలియని స్థితిలో తండ్రి. ఈ దృశ్యాన్ని చూసి అక్కడి డాక్టర్లే కన్నీటి పర్యంతమయ్యారు.
 
పుట్టిన పాపను ఎలాగైన భార్యకు చూపించాలనుకున్నాడు భర్త. అప్పుడే పుట్టిన తన పాపను తీసుకొని భార్య దగ్గరికి వెళ్లి… షెల్లి…షెల్లి …మన పాప అని చెప్పాడు. ఆ సంధర్భంలోనే ఆ పాప చిన్నగా ఏడ్చింది. ఆ పసిపాప ఏడుపు శబ్థం విని షెల్లి సడన్ గా కోమాలోంచి స్పృహలోకి వచ్చింది. ఇది వైద్యశాస్త్రంలోనే మిరాకిల్ అంటున్నారు వైద్యులు. పేగుతెంచుకుని పుట్టిన పాప.. తన తల్లిని బతికించుకుంది అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వార్త చక్కర్లు కొడుతుంది.

Watch Video:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top