జిహ్వకో రుచి అన్న చందంగా ఈ భూమిపై ఉన్న మనుషులందరి రుచులూ ఒకేలా ఉండవు. ఒకరు ఓ పదార్థాన్ని ఇష్టపడితే మరొకరు ఇంకోదాన్ని ఇష్టపడతారు. అయితే వ్యక్తిగత ఇష్టాల మాట ఎలా ఉన్న ఏదైన ఒక ప్రాంతానికి చెందిన వారు తినే రుచులు మాత్రం కొన్ని కామన్‌గా ఉంటాయి. ఉదాహరణకు హైదరాబాద్‌లో అయితే బిర్యానీ ఫేమస్. దీన్ని ఆ ప్రాంతం వారు ఎక్కువగా తింటారు. అలాగే తూర్పు ఆసియా ప్రాంతానికి చెందిన కొన్ని దేశాల వాసులు కూడా పలు రకాల ఆహార పదార్థాలను అత్యంత ఇష్టంగా తింటారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాకపోతే మీరు వాటిని చూసి తట్టుకునేంత ధైర్యం ఉంటేనే ఇది చదవండి..!
1.టర్టిల్ జెల్లీ…
టర్టిల్ (తాబేలు) పైన రక్షణగా ఉండే చిప్పను పొడిలా చేసి దాంతో టర్టిల్ జెల్లీ తయారు చేస్తారు. దీన్ని చైనాలో ఎక్కువగా తింటారు.
2.చేప వీర్యం…
జపాన్ వాసులు ఈ పదార్థాన్ని ఎక్కువగా తింటారు. అక్కడ దీన్ని షిరాకో అని పిలుస్తారు. ఆవిరిపై ఉడికించి లేదా ఫ్రై చేసి ఈ పదార్థాన్ని తింటారు.
3.పచ్చి ఆక్టోపస్ టెంటకిల్స్…
ఆక్టోపస్ జీవికి ఉండే పొడవాటి టెంటకిల్స్‌ను ఆసియా ఖండానికి చెందిన పలు దేశ వాసులు పచ్చిగానే తింటారు. లేదంటే సూప్‌లా ఉడకబెట్టుకుని కూడా తింటారు.
4.గుర్రం పచ్చి మాంసం…
జపాన్ వాసులు గుర్రానికి చెందిన మాంసాన్ని పచ్చిగానే తింటారు. దీన్ని ఎక్కువగా సూప్‌ల తయారీలోనూ వాడుతారు. అక్కడి ప్రజలకు ఇది ఫేవరెట్ డిష్.
5.కోడి వృషణాలు…
హాంగ్‌కాంగ్‌లో వీటిని ఎక్కువగా తింటారు. వాటిని పచ్చిగానే తినడం ఆ దేశవాసులకు అలవాటు. రైస్, నూడుల్స్, సూప్స్ వంటివి తయారు చేసుకుని కూడా వీటిని తింటారు.
6.అర్చిన్ జీవి బీజ కోశాలు…
సముద్రంలో జీవించే అర్చిన్ అని పిలవబడే జీవికి చెందిన బీజ కోశాలను పచ్చిగా ఉండగానే పలు దేశ ప్రాంత వాసులు తింటారు. దీనికి చుట్టూ ముళ్లు ఉంటాయి. అయినా దాన్ని ఒలిచి మరీ లోపలివి తింటారు.
7.మట్టిలో మురగబెట్టిన గుడ్లు…
కోడి, బాతు, ఇతర పిట్టలు, పక్షులకు చెందిన గుడ్లను ప్రత్యేకమైన మట్టి మిశ్రమంలో కొన్ని రోజుల పాటు మురగ బెడతారు. అనంతరం దాన్ని బయటకు తీసి అలా పచ్చిగా ఉండగానే తింటారు.
8.ఈగ లార్వా…
జపాన్ వాసులకు ఈ డిష్ అత్యంత ప్రియమైంది. ఇందులో ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయట. అందుకే వారు దీన్ని పచ్చిగా లేదంటే ఉడకబెట్టుకుని తింటారు.
9.వైన్ బాటిల్లో నిల్వ ఉంచిన పాము…
జపాన్ వాసులు పాములను వైన్ బాటిల్స్‌లో ఉంచుతారు. అప్పుడవి విషాన్ని విడుదల చేస్తాయి. అది నేరుగా వెళ్లి వైన్‌లో కలుస్తుంది. అనంతరం ఆ డ్రింక్‌ను తాగుతారు. దీంతో పురుషుల్లో లైంగిక సామర్థ్యం రెండింతలు పెరుగుతుందట.
10.కందిరీగలు…
చాకో చిప్స్, బిస్కెట్లు, క్రాకర్స్ వంటి వాటిలో ఉంచిన కందిరీగలను జపాన్ వాసులు అమితమైన ఇష్టంతో తింటారట.
11.షార్క్ సూప్…
షార్క్‌లను దండిగా వేసి వండిన సూప్‌ను పలు ప్రాంతాల్లో తింటారు. పెళ్లి వేడుకలు జరిగే సమయంలో వారు ఇలాంటి డిష్‌లను తయారు చేయిస్తారట.
12.టారంటులా…
టారంటులా అనేది ఓ సాలె పురుగు జాతి. పెద్దగా ఉంటుంది. కంబోడియా వాసులు దీన్ని ఇష్టంగా తింటారట. దీని రుచి చికెన్‌లా ఉంటుందట.
13.తాచుపాము గుండె…
వియత్నం వాసులు తాచుపాము గుండెను తిని, దాని రక్తాన్ని తాగుతారట. వినేందుకే ఇది ఎలాగో ఉంది కదూ. అయినా వారికి దీన్ని తినడం సాంప్రదాయంగా వస్తోందట.
14.మద్యంలో వేసిన పచ్చి రొయ్యలు…
మద్యంలో పచ్చి రొయ్యలను వేయగా అవి అప్పుడు నెమ్మదిగా కదులుతుంటాయి. ఆ సమయంలోనే దాన్ని గుటుక్కుమని నోట్లో వేసుకుని మింగుతారు. పలు ఆసియా దేశ వాసులు ఈ ఫుడ్‌ను తింటారు.
15.విషపూరితమైన పట్టర్ చేప…
జపాన్, ఫుగు ప్రాంత వాసులు ఈ చేపను పచ్చిగా లేదంటే ఉడకబెట్టి తింటారు. అయితే ఈ చేపకు చెందిన భాగాలు అత్యంత విషపూరితంగా ఉంటాయట. అయినప్పటికీ ఈ చేప రుచి కోసం వాటిని తీసేసి మరీ ఆ ప్రాంత వాసులు తింటారట.
16.సగం పిల్లగా మారిన గుడ్డు…
బాతు లేదా కోడికి చెందిన గుడ్డులో పిల్ల సగం తయారవ్వగానే ఆ గుడ్లను తీసి అలాగే తినేస్తారట. కొన్ని సందర్భాల్లో ఆ పిల్ల జీవంతో ఉంటుందట. మరికొన్ని సందర్భాల్లో జీవం లేకుండానూ ఉంటుందట.
17.తెల్ల చీమ గుడ్డు…
వియత్నాం, కంబోడియా, థాయ్‌లాండ్ దేశాలకు చెందిన ప్రజలు తెల్ల చీమల గుడ్లను తింటారు. సూప్, ఫ్రై వంటివి చేసుకుని మరీ ఆరగిస్తారు.
18.సగం పచ్చిగా, సగం ఉడికిన యింగ్ యాంగ్ చేప…
తైవాన్ వాసులు ఇలాంటి చేపను ఎక్కువగా తింటారు. యింగ్ యాంగ్ చేపను సగం మాత్రమే ఉడికించి తినడం వారికి అలవాటు.
19.పక్షి గూడు, చికెన్, పక్షి ఉమ్మి సూప్…
స్విఫ్ట్‌లెట్ అనే ఓ రకమైన పక్షికి చెందిన గూడున అలాగే వండి దాన్నుంచి వచ్చే సూప్‌లో పక్షి ఉమ్మి, చికెన్ కలిపి ఆ ఫుడ్‌ను తింటారట. ఆసియాలో కొన్ని వర్గాల ప్రజలు ఇలా తింటారు.
20.ట్యూనా చేప కనుగుడ్లు…
ఆసియాలోనే ఓ ప్రాంతం వారు ట్యూనా చేప కనుగుడ్లను పచ్చిగానే తింటారట. లేదంటే ఉడకబెట్టుకుని కూడా తింటారట.
21.కోతి మెదడు…
కోతిని డైనింగ్ టేబుల్ వద్దకు తెచ్చి, దాని తలపై సుత్తితో మోది, అందులోంచి మెదడును అప్పటికప్పుడు తీసి తినే వారు కూడా ఉన్నారట.
22.మనిషి పిండం…
చైనాలో గర్భస్థ శిశువు పిండాలను తింటారట. దాంతో వారికి లైంగిక సామర్థ్యం పెరుగుతుందని నమ్ముతారు. వీటి ధర రూ.3 లక్షల వరకు ఉంటుందట.