SHOCKING: మహిళలు ఆ యాడ్ పై మూత్రవిసర్జన చేస్తే డిస్కౌంట్ అంట…కానీ ట్విస్ట్ ఏంటో తెలుసా..?

ఆయా రకాల వస్తువులను తయారు చేసే కంపెనీలు అన్నాక తమ తమ ఉత్పత్తుల సేల్స్‌ను పెంచుకునేందుకు అవి రక రకాలుగా వాటికి పబ్లిసిటీ చేస్తుంటాయి. యాడ్స్‌ చేస్తారు. మ్యాగజైన్లు, పేపర్లలో యాడ్స్‌ ప్రింట్‌ ఇస్తారు. ఇలా ఏ కంపెనీ అయినా తాను తయారు చేసే వస్తువులను పబ్లిసిటీ చేసి వాటి సేల్స్‌ను పెంచుకుంటారు. ఇది ప్రపంచంలో ఎక్కడైనా ఇలాగే జరుగుతుంది. అయితే ఆ కంపెనీ మాత్రం కొంచెం ముందుకు వెళ్లి తమ ఉత్పత్తుల పబ్లిసిటీ కోసం కొంచెం ఎక్కువే పని చేసింది. అది కూడా చాలా వినూత్నమైన రీతిలో సాంకేతికతను ఉపయోగించుకుని తాను తయారు చేస్తున్న ఫర్నిచర్‌ వస్తువులకు పబ్లిసిటీ చేస్తోంది. దీంతో ఇప్పుడా కంపెనీ చేస్తున్న వినూత్న ప్రచారం నెట్‌లో వైరల్‌ అవుతోంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…

నెదర్లాండ్‌కు చెందిన ఐకియా కంపెనీ తెలుసు కదా. ఇది ప్రముఖ ఫర్నిచర్‌ కంపెనీ. త్వరలో భారత్‌లోనూ ఈ కంపెనీ ప్రవేశించి ఫర్నిచర్‌ ఉత్పత్తులను విక్రయించనుంది. అయితే ఇప్పుడిదీ కంపెనీ నెదర్లాండ్స్‌లో ఓ వినూత్న ప్రచారం నిర్వహిస్తోంది. తన ఫర్నిచర్‌ ఐటమ్స్‌ సేల్స్‌ను పెంచుకునేందుకు ఓ నూతన తరహా యాడ్‌ను మ్యాగజైన్‌లో ప్రింట్‌ చేయించింది. అయితే ఆ యాడ్‌పై మహిళలు మూత్ర విసర్జన చేయాల్సి ఉంటుంది. దాంతో వారికి ఐకియా ఫర్నిచర్‌ ఐటమ్స్‌పై డిస్కౌంట్స్‌ లభిస్తాయి.

మూత్ర విసర్జన చేయాలి అన్నాం కదా అని తప్పుగా అనుకోకండి. అసలు విషయం అది కాదు. ఎందుకంటే ఐకియా కంపెనీకి చెందిన ప్రింటైన ఆ యాడ్‌లో ఉన్న ఇన్‌బిల్ట్‌ స్ట్రిప్‌పై మహిళలు తమ మూత్రాన్ని ట్యూబ్‌తో డ్రాప్స్‌లా వేయాలి. అనంతరం వేచి చూస్తే అదే పేజీలో సదరు ఫర్నిచర్‌ ఐటమ్‌ ధర కింద దానికి లభించే డిస్కౌంట్‌ ధర ప్రత్యక్షమవుతుంది. అది కూడా ఆ మహిళ ప్రెగ్నెంట్‌ అయి ఉంటేనే ఆ డిస్కౌంట్‌ ధర అక్కడ ఆటోమేటిక్ గా మూత్రం డ్రాప్స్‌ వేయగానే కొద్ది నిమిషాలకు దర్శనమిస్తుంది. అలా ఐకియా కంపెనీ తన నూతన యాడ్‌ను వినూత్నంగా టెక్నాలజీతో రూపొందించింది. స్వీడన్‌కు చెందిన ఆకెస్టామ్‌ హోల్‌స్ట్‌ అనే కంపెనీ ఈ యాడ్‌ను తయారు చేసింది. దీని వల్ల ప్రెగ్నంట్‌ మహిళలు ఐకియా కంపెనీ ఫర్నిచర్‌ ఐటమ్స్‌ను డిస్కౌంట్‌ ధరలకే కొనుగోలు చేయవచ్చు. ఒక వేళ ప్రెగ్నెన్సీ కోసం వేచి చూస్తున్న వారికైతే ఉచితంగా ప్రెగ్నెన్సీ టెస్ట్‌ పూర్తవుతుంది. ఇలా రెండు రకాలుగా లాభం ఉంటుంది. అయితే ప్రెగ్నెంట్‌ మహిళలు కాకుండా పిల్లలను దత్తత తీసుకునేవారికి కూడా ఐకియా కంపెనీ తన ఫర్నిచర్‌ ఉత్పత్తులపై రాయితీలను అందిస్తోంది. ఏది ఏమైనా.. ఈ ఐడియా భలే విచిత్రంగా ఉంది కదా..!

Comments

comments

Share this post

scroll to top