రైలు చక్రాల కింద పలకా,బలపాలు

అప్పటి వరకు ఆటలు పాటలతో సరదాగా గడిపిన చిన్నారులు, ఒక్కసారిగా హాహాకారాలు చేస్తూ చెల్లాచెదురయ్యారు.  పలకా బలపంతో స్కూల్ కు వెళుతున్న చిన్నారులను మృత్యువు రైలు రూపంలో కబలించింది. ఈ  చేదు ఘటన జరిగి నేటికి సరిగ్గా సంవత్సరం…మెదక్ జిల్లా తుఫ్రాన్ లోని కాకతీయ టెక్నో ప్రైవేట్ స్కూల్ కు చెందిన బస్సు.. పట్టాలు దాటుతుండగా నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వస్తున్న నాందేడ్ ప్యాసింజర్.. ఢీకొట్టింది. ఘటన జరిగే టైంలో బస్సులో 45 మంది వరకు పిల్లలు ఉన్నారు. వీళ్లలో 15 మంది చనిపోయారు.

ట్రైన్ దుర్ఘటన లో అసువులు బాసిన చిన్నారులు ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ……

ఆ బడి గంటలు ఇంకా మోగలేదు.

మీ లేత పాదాల అడుగులు ఆ స్కూల్ కాంపౌండ్ ను తాకే వరకు మోగమని మారాం చేస్తున్నాయి!!!!
నిన్న నువ్వు విన్న చీమ కథ ను దాటి , ఇంకా నీ పాఠం ముందుకుపోట్లే

నువ్వులేని క్లాస్ లో, నీ బెంచీ.మీ మేడమ్ కళ్ళలో నీళ్లు సుడులు తిరిగేలా చేస్తుంది.

సంవత్సరం క్రితం లాంగ్ బెల్లు కొట్టాగానే ఆగిన మీ ఆట ను , ఈ రోజు కూడా ఆడాలని మీ దోస్తులు  ఎదురు చూస్తున్నారు..
నీ లంచ్ బాక్స్ లో పంచుకోవడానికి … ఈ రోజేముందో అని , నీ కోసం ఆ చింటు గాడు
రోడ్డు వంక చూస్తుండు మీ బస్సేమైనా ఇటుగా వస్తుందేమోనని!!!!!
మీ స్కూలు ముందు సెక్యురిటీ తాతయ్యకు ఏం తోచడం లేదు, ఇంకా మీరు అతనికి గుడ్
మార్నింగ్ అని చెప్పలేదు కదా!!!!!

టై కూడా సరిగ్గా కట్టుకోరాని మీ చేతులు చేసిన తప్పేంటి?????
అమ్మా స్కూల్ కు వెళ్ళోస్తా అని పలికిన నీ చిట్టి మాటలు చివరివై పోడానికి కారణమేంటి???
అమ్మ నాన్నల గుండెలు చెరువులు కాడానికి బాధ్యులెవరు????

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top