మొన్న ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టి ప్రియుడు ఆత్మహత్య…నేడు ఓ ప్రేయసికి అదే పరిస్థితి..!

ప్రేమ పేరుతో మోసిందని ప్రియురాలిపై పేస్ బుక్ లో ఆవేదనభరిత పోస్టు చేసి ఓ ప్రేమికుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం అయిన సంగతి తెలిసిందే. న ప్రియురాలు మరొకరితో రొమాన్స్ చేస్తున్న దృశ్యం చూసి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నరేష్ అనే ఆ యువకుడు పోస్ట్ చేసి.. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. “మా అన్నయ వస్తున్నాడు, బయటకి వెళుతున్నా, సాయంత్రం కలుస్తా” అని చెప్పిన ఆ అమ్మాయి.. అదే రోజు మరో యువకుడితో రొమాన్స్ చేస్తున్న దృశ్యం చూసి తట్టుకోలేకపోయాడు. నాతో పడుకున్నావ్ కదా ఇప్పుడు వాడు కావాలా? అంటూ ఆత్మహత్య చేసుకునే ముందు పేస్ బుక్ లో తన ఆవేదన వ్యక్తపరిచాడు. కొందరు నరేష్ కు మద్ధతుగా నిలవగా.. చనిపోయే ముందు ఇన్నాళ్లూ కనిపెంచిన అమ్మానాన్నలు గుర్తుకు రాలేదా? అంటూ మరికొందరు స్పందించారు.

ఆ ఘటన మరువకముందే.. ఇలాంటి ఘటనే విజయవాడలో వెలుగు చూసింది. కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్‌ స్టేషన్‌ లో వైజాగ్ కు చెందిన యువతి (23) ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. వివరాలలోకి వెళితే..

విజయవాడలోని కృష్ణలంక నెహ్రూనగర్‌ కి చెందిన 25 ఏళ్ల కుమార్ .. సీఏ చదువుతున్నాడు. అతనికి ఫేస్‌ బుక్‌ లో వైజాగ్ కు చెందిన బీటెక్ చదువుతున్న యువతి పరిచయం అయింది. ఈ ఫేస్ బుక్ పరిచయం ప్రేమకు దారి తీయడంతో.. పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. దీనితో యువతి తన తల్లిదండ్రులతో కలిసి మూడు నెలల క్రితం విజయవాడలోని కానూరుకు వచ్చారు.ఇంతలో ఆ ప్రేమికుల మధ్య స్పర్థలు ఏర్పడ్డాయి. ఆ యువకుడు పెళ్లి చేసుకోనని చెప్పేశాడట. యువకుడు తనను మోసం చేశాడంటూ యువతి పెనమలూరు పోలీసులను ఆశ్రయించింది. అయితే పోలీసులు పట్టించుకోలేదని భావించిన ఆ యువతి.. సాయంత్రం మళ్లీ పోలీస్ స్టేషన్ కు స్కూటీపై వచ్చి బాత్రూమ్‌ శుభ్రంచేసే యాసిడ్‌ తాగేసి ఆత్మహత్యాయత్నం చేసింది. వాంతులు చేసుకుని పడిపోయిన ఆ యువతిని.. పోలీసులు గమనించి హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితిపై ఎటువంటి క్లారిటీ ఇంకా రాలేదు.

 

Comments

comments

Share this post

scroll to top