బైక్‌ల‌లో ఉన్న పెట్రోల్‌ను దొంగ‌త‌నంగా తాగుతున్న కోతి.. వైర‌ల్ వీడియో..!

కోతుల‌న్నాక అల్ల‌రి చిల్ల‌రి చేష్ట‌లు చేయ‌డం, ఆహార ప‌దార్థాల‌ను దొంగ‌త‌నంగా ఎత్తుకెళ్లి తిన‌డం స‌హ‌జ‌మే. వాటికి ఆహారం దొరికితే ఫ‌ర్వాలేదు, లేదంటే అవి ఏకంగా ఇండ్ల‌లోకి చొర‌బ‌డి మ‌రీ ఆహారాన్ని దొంగిలిస్తాయి. కోతుల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల్లోనైతే జ‌నాలు వాటి తాకిడికి త‌ట్టుకోలేరు. అయితే అన్ని కోతులు ఆహార ప‌దార్థాల‌ను దొంగిలిస్తాయేమో గానీ, ఇప్పుడు చెప్ప‌బోయే ఆ కోతి మాత్రం అందుకు భిన్నం. దానికి ఆహారం ఏమీ అవ‌స‌రం లేదు. అలా అని చెప్పి అది ఏమీ తిన‌దు, తాగ‌దు అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్టే. ఎందుకంటే ఆ కోతి ఏం తాగుతుందో తెలిస్తే మీరు షాక‌వుతారు..!

పానీప‌ట్‌లో ఓ కోతి ఇప్పుడు అర‌టిపండ్లు, గింజ‌లు, పండ్లు వంటి ఆహార ప‌దార్థాల‌ను తిన‌డం లేదు. మ‌రేమి తింటుందంటే.. సారీ.. తిన‌దు తాగుతుంది.. పెట్రోల్‌. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. కావాలంటే పైన ఇచ్చిన వీడియోలో మీరు చూడ‌వ‌చ్చు. ఓ కోతి బైక్ పెట్రోల్ పైప్‌ను పీకి మ‌రీ దాన్ని నోట్లో పెట్టుకుని పెట్రోల్‌ను ఎంచక్కా సేవిస్తోంది. అయితే ఆ కోతి అలా పెట్రోల్ ఎలా తాగుతుందో తెలుసుకునేందుకు అక్క‌డి వారు ఏకంగా దానిపై నిఘా పెట్టారు కూడా. అందులో భాగంగానే ఆ కోతి కెమెరా కంటికి చిక్కింది. బైక్ ల నుంచి పెట్రోల్ తాగుతూ అడ్డంగా ప‌ట్టుబ‌డింది.

అయితే కోతి బైక్‌ల‌లో పెట్రోల్ తాగుతుంద‌ని ఎలా తెలిసిందంటే… పానీప‌ట్‌లో కొంద‌రు వ్యాపారులు త‌మ బైక్‌ల‌ను షాపుల ఎదుట పార్క్ చేశారు. ఈ క్ర‌మంలో రోజూ సాయంత్రం పూట ఇంటికి వెళ్దామ‌ని బైక్ తీస్తే అందులో పెట్రోల్ ఉండేది కాదు. మ‌రి పెట్రోల్ ఎలా మాయ‌మ‌వుతుంది అని వారు ఆశ్చ‌ర్య‌పోయేవారు. ఈ క్ర‌మంలోనే వారంతా క‌లిసి ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు. త‌మ బైక్‌ల‌లో పెట్రోల్ ఎలా పోతుందో తెలుసుకోవాల‌ని కాపు కాశారు. అలా ఆ సంద‌ర్భంలో కోతి పెట్రోల్ తాగుతూ కెమెరా కంటికి చిక్కింది. దీంతో ఆ కోతి పెట్రోల్ తాగుతున్న‌ప్పుడు తీసిన వీడియో కాస్తా వైర‌ల్ అయింది. అయితే ఇప్పుడు అది పెట్రోల్ తాగ‌డం లేద‌ట‌. ఎందుకంటే కొంద‌రు వాలంటీర్లు ఓ స్వ‌చ్ఛంద సంస్థ నుంచి కోతిని తీసుకెళ్లారు. పెట్రోల్ వ‌ల్ల చెడిపోయిన దాని శ‌రీరాన్ని వారు బాగు చేయిస్తున్నారు. అవును మ‌రి, కోతుల‌కే కాదు, పేద‌ల‌కు తినేందుకే ఆహారం దొర‌క‌డం లేదు, ఇక పాపం కోతులు ఏం చేస్తాయి లెండి..!

Watch Video:

 

 

Comments

comments

Share this post

scroll to top