సేవ‌ల పేరుతో బ్యాంకుల శ‌ఠ‌గోపం – ఖాతాదారుల జేబుల‌కు చిల్లు

రోజంతా క‌ష్ట‌ప‌డి .చెమ‌ట చుక్క‌లు చిందించి.ఎప్పుడో అవ‌స‌ర‌మ‌వుతాయ‌ని .దాచుకున్న డ‌బ్బుల‌న్నీ ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ బ్యాంకుల‌కు కాసులు కురిపించేలా చేస్తున్నాయి. ఏ ఖాతా నిర్వ‌హించాల‌న్నా స‌వాల‌క్ష నిబంధ‌న‌లు. ఒక‌ప్పుడు డ‌బ్బులు త‌మ వ‌ద్ద పెట్టండంటూ బ్యాంక‌ర్లు మ‌న ఇళ్ల చుట్టూ తిరిగే వారు. ఒక్కోసారి తాయిలాలు కూడా అందించి ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేసేవారు. ఇపుడా ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింది. టెక్నాల‌జీ ప‌రంగా వ‌చ్చిన పెను మార్పులు బ్యాంకింగ్ రంగంపై తీవ్ర ప్ర‌భావం ప‌డేలా చేసింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రైవేట్ బ్యాంకుల‌దే బిగ్ రోల్ పోషిస్తాయి. ఇండియాలో 100 కోట్లుకు పైగా ఉన్న జ‌నంలో అత్య‌ధిక శాతం పేద‌లు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లే. వీరే అన్ని బ్యాంకుల‌కు అందివ‌చ్చిన ఖాతాదారులు. సేవింగ్స్, క‌రెంట్, జాయింట్ అకౌంట్స్ అంటూ జనాన్ని అల‌వాటు చేశాయి. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు రోజూ వారీ లావాదేవీలు, కార్య‌క‌లాపాల‌న్నీ బ్యాంకుల ద్వారా జ‌రుగుతూ వుంటాయి.

bank

రైల్వే, పోస్ట‌ల్ డిపార్ట్ మెంట్ త‌ర్వాత అతి పెద్ద రంగం ఏదైనా ఉందంటే అది బ్యాంకింగ్ వ్య‌వ‌స్థేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఫిక్స్ డ్ డిపాజిట్లు, రిక‌రింగ్ డిపాజిట్లు, త‌దిత‌ర ప‌థ‌కాల‌తో అన్ని బ్యాంకులు సేవ‌లందిస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , ఆంధ్రా బ్యాంకు, పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్, విజ‌యా బ్యాంకు, ఐడీబీఐ , త‌దిత‌ర బ్యాంకులు ఆర్బీఐ ప‌రిధికి లోబ‌డి ప‌నిచేస్తున్నాయి. ఖాతాదారుల‌కు సేవ‌లు అందించ‌డంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా త‌క్ష‌ణ‌మే అంబుడ్స్ మెన్ వ్య‌వ‌స్థ‌ను ఆర్బీఐ ముందు జాగ్ర‌త్త‌గా ఏర్పాటు చేసింది. ప్ర‌భుత్వ ప‌రంగా ఎన్నో శాఖ‌లు ఉంటాయి. ఎక్కువ శాతం రాష్ట్రాల‌కు చెందిన‌వైతే మిగ‌తావి కేంద్రానికి చెందిన‌వి. ఆయా సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌కు సంబంధించిన నిధుల‌న్నీ ప్ర‌భుత్వ బ్యాంకుల్లోనే జ‌మ చేస్తారు. ఆయా శాఖ‌ల‌కు ప్ర‌త్యేకంగా ఖాతాలు ఉంటాయి. ఎక్కువ మ‌టుకు డిపాజిట్లు చేస్తాయి.

అంతే కాకుండా ఆభ‌ర‌ణాలు కుద‌వ పెట్టుకుని బ్యాంకులు సేవ‌లందిస్తున్నాయి. వీటికి కూడా సేవ‌ల పేరుతో కొన్ని రుసుములు వ‌సూలు చేస్తుంటాయి. చెక్కులు జారీ చేయ‌డం, డీడీలు ఇలా ప్ర‌తిది బ్యాంకుల ద్వారానే జ‌రుగుతున్నాయి. దీంతో డిపాజిట్లు సేక‌రించ‌డం, రుణాలు ఇవ్వ‌డం, వ‌డ్డీ కింద తిరిగి తీసుకోవ‌డం.లాంటివి బ్యాంకులు చేస్తాయి. వీటి ద్వారా వ‌చ్చిన రూపాయ‌ల‌నే ఆదాయంగా ప‌రిగ‌ణిస్తారు. బ్యాంకుల ఏర్పాటు, నిర్వ‌హ‌ణ‌, సిబ్బంది జీత‌భ‌త్యాలు , ట్రైనింగ్స్ ఇలా అన్ని ఖ‌ర్చులు ఖాతాదారుల మీదే వ‌సూలు చేస్తారు. ఇదంతా బ‌హిరంగ ర‌హ‌స్యం. ఒక్కో బ్యాంకు ఒక్కో రుసుము ఏర్పాటు చేసింది. కొన్ని బ్యాంకులు సేవింగ్స్ ఖాతాల్లో ఎలాంటి నిల్వ లేక పోయినా ప‌ర్వాలేదంటూ అకౌంట్లు తెరుస్తున్నారు. ల‌క్ష‌లాది మంది ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ బ్యాంకుల‌లో ప‌నిచేస్తున్నారు. వేత‌న స‌వ‌ర‌ణ చేయాల‌ని, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామ‌ని దేశ వ్యాప్తంగా స‌మ్మెలు, ఆందోళ‌న‌లు, పోరాటాలు చేస్తున్నారు. నోట్ల ర‌ద్దు త‌ర్వాత బ్యాంకుల‌పై ఉన్న న‌మ్మ‌కం కాస్తా పోయింది.

ప్ర‌జ‌ల సొమ్మును అప్ప‌నంగా బ‌డా వ్యాపార‌వేత్త‌ల‌కు క‌ట్ట‌బెట్టి జ‌నం నెత్తిన శ‌ఠ‌గోపం పెట్టిన చ‌రిత్ర ఈ బ్యాంకుల‌కు ఉంది. ఆస్తుల‌ను త‌క్కువ‌కు కొన‌డం.ఎక్కువ వాల్యూ చూపించ‌డం దాని ద్వారా రుణాలు తీసుకోవ‌డం.జ‌ల్సాలు, ఎంజాయ్ చేయ‌డం.ఇత‌ర దేశాల‌కు వెల్లి పోవ‌డం.ఇదీ జ‌రుగుతున్న క‌థ‌. ఇపుడు బ్యాంకుల‌పై నియంత్ర‌ణ అంటూ లేకుండా పోయింది. ఖాతాదారుల కోసం వేచి చూసిన బ్యాంకులు, బ్యాంక‌ర్లు ఇపుడు డోంట్ కేర్ అంటున్నాయి. బ్యాంకులు ప్ర‌జ‌ల‌కు సేవ‌లందిస్తున్నాయ‌నే ఉద్దేశంతో ఆర్బీఐ క‌ఠిన‌త‌ర‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటుంది. ఇప్ప‌టికీ కేంద్ర స‌ర్కార్ ఆజ‌మాయిషీ ఉంటుంది క‌నుక ఎక్కువ నేరాలు చేసే వీలుండ‌దు. ఆర్థిక నేరాలు ఇటీవ‌ల ఎక్కువ‌య్యాయి. ఆర్థిక నేర‌గాళ్ల‌కు పొలిటిక‌ల్ లీడ‌ర్ల స‌పోర్ట్ తో పాటు బ్యాంకుల్లో ప‌నిచేస్తున్న సిబ్బందే వీరికి తోడుగా నిల‌వ‌డంతో నేరాలకు అంతులేకుండా పోతోంది.

ఇక ఎనీ టైం మిష‌న్ పేరుతో ఏర్పాటు చేసిన ఏటీఎంలు నో మ‌నీ అంటూ నోటీసు బోర్డులు వేలాడుతున్నాయి. పీఎం మోడీ తీసుకున్న నోట్ల ర‌ద్దు కార్య‌క్ర‌మం దెబ్బ‌కు బ్యాంకులు కునారిల్లిపోయాయి. ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని కోల్పోతున్నాయి. ఎక్కువ ఖాతాదారుల‌ను క‌లిగి ఉన్న బ్యాంకుగా ఎస్ బీఐ ఉన్న‌ది. ఖాతా తెరిచినందుకు, చెక్కులు , ఏటీఎంలు వాడుతున్నందుకు రుసులు ముక్కు పిండి వ‌సూలు చేస్తున్నాయి. ఆయా బ్యాంకులు డిజిట‌ల్ టెక్నాల‌జీని ఉప‌యోగిస్తున్నాయి. క‌నీస నిల్వల‌ను మెయింటెనెన్స్ చేయ‌క పోవ‌డంతో వ‌సూలు చేసిన డ‌బ్బుల లెక్క‌లు చూస్తే ఆశ్చ‌ర్యానికి లోన‌వుతాం. వంద కోట్ల‌నుకుంటే పొర‌పాటే.ఏకంగా 10 వేల కోట్ల‌కు చేరింది. సో సేవ‌ల పేరుతో ఈ బ్యాంకుల‌న్నీ మ‌న‌కే శ‌ఠ‌గోపం పెడుతున్నాయ‌న్న మాట‌.

క‌నీస నిల్వ లేనందుకు గాను వ‌సూలు చేసిన డ‌బ్బులు అక్ష‌రాల 6 వేల 246 కోట్లు కాగా ప‌రిమితికి మించి ఏటీఎంల‌లో లావాదేవీలు నిర్వ‌హించినందుకు వ‌సూలు చేసిన ఛార్జీలు 4 వేల 145 కోట్లు . పేద‌లు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల నుండి ఇవ‌న్నీ వ‌సూలు చేసాయి బ్యాంకులు. మొత్తం వ‌సూలైన డ‌బ్బులు 10 వేల కోట్ల‌ను దాటింది. ఖాతాదారుల నుండి అభ్యంత‌రాలు రావ‌డంతో ఎస్బీఐ 2012లో ఆపి వేసింది.2017 ఏప్రిల్ నుంచి మ‌ళ్లీ వ‌సూలు దందా స్టార్ట్ చేసింది. ఈ విష‌యాన్ని సాక్షాత్తూ పార్ల‌మెంట్ లో స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఎన్ని వ‌సూలు చేశాయో చెప్పింది. ఎస్బీఐతో పాటు అన్ని బ్యాంకులు ఇదే బాట ను ఎంచుకున్నాయి. ఏటీఎం లావాదేవీల‌కు సంబంధించి 1 వేయి 554 కోట్లు, జ‌న్‌ధ‌న్ ఖాతాల‌కు, బేసిక్ పొదుపు ఖాతాల‌కు క‌నీస నిల్వ ప‌రిమితి లేదు. మెట్రో న‌గ‌రాల్లో నెల‌కు మూడు లావాదేవీలు, మిగ‌తా చోట్ల ఐదు లావాదేవీలు ఉచితం. ఈ ప‌రిమితి దాటితే 20 రూపాయ‌ల రుసుము వ‌సూలు చేస్తోంది.

చూస్తే త‌క్కువ మొత్తంలో ఉన్న ఈ రూపాయ‌లు పోగేస్తే వేల కోట్లు దాటి పోయాయి. 2017-2018వ ఆర్థిక సంవ‌త్స‌రంలో 5 వేల కోట్ల జ‌రిమానాను ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ బ్యాంకులు విధించాయి. నాలుగు కేటగిరీల్లో బ్రాంచులను క్లాసిఫై చేసింది ఎస్బీఐ రూరల్‌, సెమీ-అర్బన్‌, అర్బన్‌, మెట్రో. బ్రాంచు ఉండే ప్రాంతం బట్టి సగటు నెలవారీ నిల్వలు బ్యాంక్‌ అకౌంట్‌లో తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ కస్టమర్‌ కనుక ఈ నిల్వలను నిర్వహించలేని పక్షంలో, జరిమానాలను ఎదుర్కొనాల్సి వస్తుంది. మెట్రో ప‌రంగా నెల‌కు ఛార్జీలు 3 వేలు, అర్బ‌న్ ప‌రంగా 3 వేలు, సెమీ అర్బ‌న్ ప‌రంగా 2 వేలు, రూర‌ల్ లో 1000 రూపాయ‌లు క‌నీస నిల్వ ఉంచాలి. ఎస్‌బీఐ జరిమానాల పేరిట అత్యధికంగా రూ.2,433.87 కోట్లు వసూలు చేసింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రూ.590.84 కోట్లు, యాక్సిస్‌ బ్యాంక్‌ రూ.530.12 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకు రూ.317.6 కోట్లు జరిమానా రూపంలో వసూలు చేశాయి. మ‌నం రేయింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డి దాచుకున్న డ‌బ్బుల‌కు ర‌క్ష‌ణ‌గా ఉండాల్సిన బ్యాంకులు, బ్యాంక‌ర్లు ఇపుడు మ‌న పాలిట శాపంగా మారాయి. రాను రాను బ్యాంకులు చేతులెత్తేసినా ఆశ్చ‌ర్య పోవాల్సిన ప‌నిలేదు. ఓ ర‌కంగా సేవ పేరుతో బ‌హిరంగ దోపిడీకి పాల్ప‌డుతున్నాయ‌న్న మాట‌.

Comments

comments

Share this post

scroll to top