పుట్టు మచ్చల పవర్.!? మచ్చపై వెంట్రుకలుంటే కీర్తివంతులు, తలలో ఉంటే గర్వము.

చేతిగీతలు, పుట్టుమచ్చలు మన జాతకాన్ని చెప్పడానికి ఉపయోగించే బేస్  ఐటమ్స్….వీటిని మూఢ నమ్మకాలని కొట్టిపారేషేవారు కొందరు, నమ్మే వాళ్లు మరికొందరు… వీటి ద్వార మేం చెప్పేది ఒక్కటే నమ్మడం నమ్మక పోవడం మీఇష్టం. కానీ మంచి జరుగుతుందంటే నమ్మండి అది ఓ పాజిటివ్ ఆటిట్యూడ్ ను ఇస్తుంది. చెడు అంటే ఆ విషయాల పట్ల కాస్త ముందు జాగ్రత్తగా ఉండి వాటిని సరిదిద్దుకోండి. సో ఇప్పుడు బాడీ లో ఉండే పుట్టుమచ్చల ఆధారంగా మనకు కలిగే ప్రయోజనాల గురించి తెల్సుకుందాం.

 • పుట్టుమచ్చల మీద వెంట్రుకలు ఉన్న వారు ధనవంతులు, కీర్తివంతులు అవుతారట.  పురుషులకు రెండు కనుబొమల మధ్య పుట్టుమచ్చలు ఉంటే ఆ వ్యక్తి దీర్ఘాయుష్మంతుడవుతాడు. బంధుప్రియుడవుతాడు. భోగములందు ఆసక్తి కలిగివుంటాడు. సువాసన ద్రవ్యముల పట్ల ప్రేమకలిగి వుంటాడని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

 

 • తలలో పుట్టుమచ్చలు కలిగిన పురుషునికి గర్వము ఎక్కువ . వారు ప్రతి అంశాన్ని విమర్శనాత్మకం గా గమనిస్తారు . మంచి ఆశాభావం గలవారు , రాజకీయ , సామాజిక అంశాలలో మంచి శ్రద్ధ‌ కలిగి ఉంటారు . నుదుటి మీద ఉంటే మంచి కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు. ఆర్థిక స్వతంత్రం ఉంటుంది. రాజకీయాల్లో రాణిస్తారు.
   scalp-55956_960_720
 • నుదుటి కింది భాగంలో ఉంటే మంచి లక్ష్యాన్ని, ఏకాగ్రతను కలిగి ఉంటారు. 40 ఏళ్ల తర్వాత విజయం సాధిస్తారు. కనుబొమ్మపై ఉంటే కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. కొంతమందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈర్ష్య ఉండదు.
 • ముక్కుపై ఉంటే కొంత మందిలో క్రమశిక్షణ లోపిస్తుంది. చెవికి చెందిన ఏ భాగము లో ఉన్నా ధనం కనిపిస్తూ ఉంటుంది .సమాజం లో గౌరవం తో కూడిన గుర్తింపు ఉంటుంది .
 • పెదవిపై ఉంటే కొన్నిసార్లు మీ బంధువులు, స్నేహితుల విషయంలో మీకు ఈర్ష్య కలుగుతుంది. బుగ్గపై ఉంటే రాజకీయాల్లో రాణిస్తారు. స్థిరాస్తులు గడిస్తారు.
 • నాలుకపై ఉంటే మీరు మంచి తెలివితేటలు, విద్యను కలిగి ఉంటారు. గడ్డంపై ఉంటే ఆడ , మగ వారిలో భిన్నంగా ఫలితాలు ఉంటాయి. గడ్డం మధ్యలో పుట్టు మ‌చ్చ ఉన్న మగవారు ఉదారగుణము కలిగి ఉంటారు . ఆడ వారికి భక్తిభావం మెండు. మంచి అదృష్టవంతులవుతారు .
 • భుజంపై ఉంటే మర్యాదస్తులుగా ఉంటారు. కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉంటారు. ఆనందకరమైన దాంపత్య జీవితం కొనసాగిస్తారు. మోచేయిపై ఉంటే మీ జీవితంలోని లక్ష్యాలను చేరుకోవడంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు.
   494372287_XS
 • ఎడమ చంక భాగంలో ఉంటే మీ ప్రారంభ జీవితంలో కొంత ఒడిదుడుకులున్నా తర్వాత నెమ్మదిగా సర్దుకుంటాయి. కుడి చంక భాగంలో ఉంటే భద్రత విషయంలో మీరు చాలా మెళకువగా ఉంటారు.  మెడ భాగంలో ఉంటే కొన్ని సమయాల్లో మీకు దురదృష్టం తప్పదు. ఇతరులు మిమ్మల్ని మోసగించేందుకు ప్రయత్నిస్తారు.
 • నుదుటి పై భాగమునందు పుట్టుమచ్చ ఉన్న స్త్రీలకు అహంకారము ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అయినప్పటికీ ఉన్నత విద్యను అభ్యసించగలరు. జ్ఞానవంతురాలు, కళలయందు ఆసక్తి ఎక్కువగా ఉండటమేగాక ర‌చనలు చేయడం, పత్రికా రంగంలో ఉన్నత రచయత్రి అయ్యే అవకాశం ఉంది.
 • కుడి కనుబొమ మీద మచ్చ ఉన్నవారికి వివాహము త్వరిత గతిన అవుతుంది. కుడి కంటి రెప్పపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే సంపదలను కలిగి ఉంటాడు. వాహన సౌఖ్యము లభిస్తుంది. మొత్తమ్మీద ముఖానికి కుడి వైపున పుట్టుమచ్చలు కలిగిన పురుషులు అదృష్టవంతులుగా ఉంటారు. ఎడమవైపు పుట్టుమచ్చలు ఉంటే ఫలితాలు మిశ్రమము గా ఉంటాయి .
 • శరీరం ముందు భాగంలో ఉంటే ఆకస్మిక ధన లాభం. శరీరం వెనుక భాగంలో ఉంటే మీరు కష్టపడి పని చేసినా ఆ పేరు ఇతరులకు దక్కుతుంది.

Comments

comments

Share this post

scroll to top