“దాసరి నారాయణ రావు” గురించి “మోహన్ బాబు” ఏమన్నారో తెలుసా..? ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు..!

ద‌ర్శ‌క నిర్మాత‌ దాసరి నారాయణ రావు మ‌ర‌ణించారు. గ‌త కొన్ని నెల‌లుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న దాస‌రి కిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. . బీపీలో హెచ్చుతగ్గులు, అన్నావాహికకు రంద్రాలు, దాని వల్ల ఇన్‌ఫెక్షన్ సోకడం వల్ల దాస‌రి మ‌ర‌ణించిన‌ట్టు తెలుస్తోంది.! ఈ ఏడాది జనవరి 19న మొదటిసారి ఆసుపత్రిలో చేరి, మార్చి 29న డిశ్చార్జ్ అయ్యిన దాస‌రి . మళ్లీ ఈ నెల 17న రెండోసారి ఆసుపత్రిలో చేరారు.! అదే అనారోగ్య కార‌ణాల రీత్యా మే 30 న క‌న్నుమూశారు.!

దాసరి మరణంతో నటుడు మోహన్‌బాబు వెక్కివెక్కి ఏడ్చారు. కిమ్స్ ఆసుపత్రికి వచ్చిన ఆయన దాసరి మరణ వార్త విని తట్టుకోలేకపోయారు. ఒక చరిత్ర ముగిసిందని, భారత సినీ చరిత్రలో దాసరి కొత్త అధ్యాయం సృష్టించారని మోహన్‌బాబు చెప్పారు. నటుడిగా తనకు జన్మ నిచ్చారంటూ కన్నీళ్ల పర్యంతమైన మోహన్‌బాబును ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. దాసరి గారితో మోహన్ బాబు గారికి చిన్నప్పటి నుండి సాన్నిహిత్యం ఉండటంతో దాసరి గారి మరణాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు!

watch video here:

Comments

comments

Share this post

scroll to top