“రోహిత్” 100 కొడతాడని “కైఫ్” ముందే చెప్పాడంట…కైఫ్ ని సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు..అసలేమైంది?

శ్రీ‌లంక‌తో ఇండోర్‌లో తాజాగా జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఆట‌గాడు రోహిత్ శ‌ర్మ కేవ‌లం 35 బంతుల్లోనే సెంచ‌రీ చేసి మ‌న హృద‌యాల‌ను గెలుచుకోవ‌డ‌మే కాదు, అంద‌రినీ సంభ్ర‌మాశ్చ‌ర్యాల్లో ముంచెత్తాడు. ఎందుకంటే ఈ ఘ‌న‌త సాధించిన రెండో బ్యాట్స్‌మెన్‌గానే కాదు, తొలి ఇండియ‌న్ బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ అంద‌రికీ షాక్ ఇచ్చాడు. దీంతో సోష‌ల్ మీడియాలో ఇప్పుడు చాలా మంది రోహిత్‌ను ప్ర‌శంస‌ల వ‌ర్షంతో ముంచెత్తుతున్నారు. అయితే టీమిండియా మాజీ ఆట‌గాడు మ‌హ‌మ్మ‌ద్ కైఫ్ కూడా రోహిత్‌ను ప్ర‌శంసించాడు. కానీ అత‌ని ప్ర‌శంస‌లో మ‌రో విష‌యం కూడా ఉంది. అదే ఇప్పుడు జ‌నాల‌కు న‌చ్చ‌డం లేదు. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే…

టీమిండియా మాజీ ఆట‌గాడు మ‌హ‌మ్మ‌ద్ కైఫ్ రోహిత్ శ‌ర్మ టీ20 సెంచ‌రీ ప‌ట్ల స్పందించాడు. రోహిత్ శ‌ర్మ సెంచ‌రీ చేస్తాడ‌ని తాను ముందుగానే చెప్పాన‌ని, ఓ ఫ్రెండ్‌తో ఇదే విష‌యం చ‌ర్చించాన‌ని కావాలంటే అత‌నితో జ‌రిపిన సంభాష‌ణ స్క్రీన్ షాట్‌ను చూడ‌వ‌చ్చ‌ని కైఫ్ ట్విట్ట‌ర్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. అందులో త‌న వాట్సాప్ స్క్రీన్ షాట్‌ను కూడా షేర్ చేశాడు. అందులో నిజంగానే రోహిత్ శ‌ర్మ 100 చేస్తాడ‌ని ఉంది. అయితే ఇదే విష‌యంపై ఇప్పుడు ట్విట్ట‌ర్‌లో జోకులు పేలుతున్నాయి.

రోహిత్ శ‌ర్మ సెంచ‌రీ చేస్తాడ‌ని ముందుగానే చెప్పాన‌ని కైఫ్ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ పెట్ట‌డంపై అభిమానులు విమ‌ర్శిస్తున్నారు. కైఫ్ పెట్టిన పోస్టును గ్రాఫిక్స్ చేశాడ‌ని, అది నిజం కాద‌ని కొంద‌రు అంటున్నారు. ఇక మ‌రికొంద‌రు ఇంకా కొంత ముందుకు వెళ్లి దేశానికి కాబోయే ప్ర‌ధాని ఎవ‌రో ముందే చెప్ప‌వ‌చ్చు క‌దా, వాట్సాప్‌లో నువ్వొక్క‌డివే మెసేజ్‌లు పెట్టావు, సంభాష‌ణ జ‌రిపితే నీ ఫ్రెండ్ రిప్లై ఎందుకు ఇవ్వ‌లేదు, క‌నుక నీ మెసేజ్ ఫేక్ అని కొంద‌రు అంటున్నారు. ఏది ఏమైనా మ‌హమ్మ‌ద్ కైఫ్ ట్విట్ట‌ర్‌లో పెట్టిన ఆ మెసేజ్ ఇప్పుడు తెగ వైర‌ల్ అవుతోంది..!

Comments

comments

Share this post

scroll to top