నోట్లను రద్దు చేసినట్టుగానే….స్థిరాస్తులను రద్దు చేయనున్నారా? ఈ-ప్రాప‌ర్టీ పాస్ బుక్ అంశాలు!!

న‌వంబ‌ర్ 8, 2016వ తేదీన పెద్ద నోట్ల ర‌ద్దు ప్ర‌క‌ట‌న‌తో న‌ల్ల కుబేరులు, అవినీతి ప‌రులు, న‌కిలీ క‌రెన్సీపై ప్ర‌ధాని మోదీ ఏవిధంగా బాంబ్ పేల్చాడో అంద‌రికీ తెలిసిందే. దీన్ని చాలా మంది న‌ల్ల‌ధనంపై స‌ర్జిక‌ల్ స్ట్రైక్ అని కూడా పిలిచారు. అనంత‌రం జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను మ‌నం ఎప్ప‌టిక‌ప్పుడు గ‌మ‌నిస్తూనే ఉన్నాం. అయితే అతి త్వ‌ర‌లోనే మోదీ మ‌రో నిర్ణయంతో మ‌రోసారి స‌ర్జిక‌ల్ స్ట్రైక్ చేయ‌నున్నారు. అదేనండీ..! బినామీ స్థిరాస్తుల‌పై..! దీని కోసం ప్ర‌త్యేకంగా బినామీ చ‌ట్టం కూడా తీసుకురానున్నారు. అదిప్పుడు రూప‌క‌ల్ప‌న ద‌శ‌లో ఉంద‌ని తెలిసింది.

modi-benami-law

చాలా మంది న‌ల్ల కుబేరులు త‌మ వ‌ద్ద ఉన్న ధ‌నాన్ని రియ‌ల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబ‌డి పెట్టి త‌మ‌కు చెందిన అనేక మంది పేర్ల‌పై బినామీ స్థిరాస్తుల‌ను కొనుగోలు చేశారు. ఈ విష‌యం అందరికీ తెలుసు. అయితే ఇలాంటి బినామీ ఆస్తులు ఇక‌పై కేంద్ర ప్ర‌భుత్వం వశం కానున్నాయి. అదెలాగంటే ఈపీపీబీ ద్వారా. ఈ-ప్రాప‌ర్టీ పాస్ బుక్ పేరిట ఓ వినూత్నమైన కార్య‌క్ర‌మాన్ని కేంద్రం జ‌న‌వ‌రి 4, 2017 నుంచి అమ‌లు చేయ‌నుంద‌ని స‌మాచారం. దీని ప్ర‌కారం మ‌న‌కు తెలుస్తున్న విష‌యాలు ఏమిటంటే…

1. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్ట‌నున్న ఈ-ప్రాప‌ర్టీ పాస్ బుక్ అమ‌లులోకి వ‌చ్చిన వెంట‌నే దేశంలో ఉన్న పౌరులంద‌రి స్థిరాస్తులు గుర్తింపును కోల్పోతాయి. అంటే అవి ఇన్‌వాలిడ్ అవుతాయ‌న్న‌మాట‌.

2. అలా ఆ కార్య‌క్ర‌మం ప్రారంభం కాగానే పౌరులంద‌రూ త‌మ పేరిట ఉన్న స్థిరాస్తుల‌ (ల్యాండ్‌, ఇల్లు వంటివి) వివ‌రాల‌ను ఈ-ప్రాప‌ర్టీ పాస్ బుక్ లో న‌మోదు చేయించుకోవాల్సి ఉంటుంది. అందుకు గాను స‌ద‌రు ల్యాండ్ లేదా ఇల్లు త‌మ‌దేన‌ని ధ్రువీక‌రించే ప‌త్రాల‌ను కూడా స‌బ్ రిజిస్ట్రార్‌కు చూపించాల్సి ఉంటుంది.

3. ఈ-ప్రాప‌ర్టీ పాస్ బుక్ లో న‌మోదు అయిన పౌరుల వివ‌రాల‌ను ఆధార్‌, పాన్ కార్డుల‌తో అనుసంధానం చేస్తారు.

4. ఈ-ప్రాప‌ర్టీ పాస్ బుక్ లో వివ‌రాల‌ను న‌మోదు చేయించుకోవాలంటే వేరే పౌరులు రిజిస్ట్రార్ కార్యాల‌యానికి వెళ్ల‌కూడ‌దు. ల్యాండ్ లేదా ఇల్లు క‌లిగిన ఓన‌ర్ మాత్ర‌మే వెళ్లి వివ‌రాల‌ను న‌మోదు చేయించాలి.

5. అప్ప‌టి వ‌ర‌కు ఏ పౌరుడు కూడా త‌న ప్రాప‌ర్టీని అమ్మేందుకు వీలు కాదు. అలాగే ఇత‌రులు దాన్ని కొన‌లేరు కూడా. ఒక‌సారి ఈ-ప్రాప‌ర్టీ పాస్ బుక్ లో వివ‌రాలు విజ‌య‌వంతంగా న‌మోదు అయితే ఆపై పౌరులు త‌మ ఆస్తుల‌ను నిర‌భ్యంత‌రంగా విక్ర‌యించుకోవ‌చ్చు. అందుకు ఎలాంటి అనుమ‌తులు అవస‌రం ఉండ‌వు.

6. మార్ట‌గేజ్ లోన్లు లేదంటే ఇత‌ర ఎమ‌ర్జెన్సీ స‌మ‌స్య‌లు ఉన్న‌వారికోసం ప్ర‌త్యేక కౌంట‌ర్ల‌ను తెర‌వ‌నున్నారు.

7. రానున్న 2018 మార్చి 31 వ‌ర‌కు పౌరులు త‌మ త‌మ స్థిరాస్తుల వివ‌రాల‌ను ఈ-ప్రాప‌ర్టీ పాస్ బుక్ లో క‌చ్చితంగా న‌మోదు చేయించుకోవాలి. లేదంటే ఆ తేదీ త‌రువాత కూడా రిజిస్ట‌ర్ చేయించ‌ని ప్రాప‌ర్టీలు కేంద్ర ప్ర‌భుత్వం ఆధీనంలోకి వెళ్లిపోతాయి. మ‌ళ్లీ వెన‌క్కి రావు.

న‌ల్ల‌ధ‌నం పై చేసిన‌ట్టుగానే ప్ర‌ధాని మోడీ స్థిరాస్తుల‌పై కూడా పైన చెప్పిన విధంగా స‌ర్జిక‌ల్ స్ట్రైక్ చేయ‌నున్నార‌ని తెలిసింది. మొన్నా మ‌ధ్యే ఓ స‌భ‌లో మోదీ బినామీ చ‌ట్టం తెస్తామ‌ని ప్ర‌క‌టించారు కూడా. ఈ నేప‌థ్యంలో మ‌రో స‌ర్జిక‌ల్ స్ట్రైక్ తప్ప‌ద‌ని ఇప్పుడు ఎక్క‌డ చూసినా వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రీ సోష‌ల్ మీడియాలోనైతే పై అంశాల‌తో కూడిన పోస్టులు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇక ఈ విష‌యం నిజ‌మ‌వుతుందో కాదో అప్ప‌టి వ‌ర‌కు వేచి చూస్తేనే తెలుస్తుంది.

Comments

comments

Share this post

scroll to top