సారీ మోడీ… తప్పైందని లెంపలేసుకున్న గూగుల్.

ఒక్క సారి గూగుల్ సెర్చ్ లోకి వెళ్లండి, టాప్ 10 క్రిమినల్స్ అని సెర్చ్ చేయండి. నేనైతే ఆశ్చర్యపోయాను. మరి  ఇప్పుడు మీ వంతు అంతలా అవాక్కయ్యే మ్యాటర్ ఏంటంటారా.? మన ప్రధాని నరేంద్రమోడీ పేరు అందులో దర్శనమిచ్చింది. మీరు నమ్మరా..అయితే ఈ ఫోటో చూడండి.

top 10 criminals

ఒసామా బిన్ లాడెన్, దావూద్ ఇబ్రహీం, అల్ జవహరి.. ఇలాంటి కరడుగట్టిన నేరస్థుల జాబితాలోనే ప్రధానమంత్రి ఫొటో కూడా పెట్టేశారు. సాంకేతికంగా ఏదో సమస్య వచ్చిందా.. లేక ఎవరైనా కావాలని ఇలా పెట్టారా అన్న విషయం ఇంకా నిర్ధారణ కాలేదు. సోషల్ మీడియాలో మాత్రం ఇది వైరల్ గా విస్తరిస్తోంది. చూసిన ప్రతి ఒక్కరూ షాక్ గా ఫీల్ అవుతున్నారు.

అయితే ఇదే విషయమై గూగుల్ ప్రతినిధి  ఒకరు మోడీకి క్షమాపణలు తెలిపారు.”ఈ ఫలితాలు గూగుల్ అభిప్రాయం ప్రకారం రావు. కొన్నిసార్లు ఆశ్చర్యపూర్వక ఫలితాలు వస్తాయి.  పొరపాటు కారణంగానే ఇలా జరిగి వుండవచ్చు. ఇందుకు క్షమాపణ చెబుతున్నాము. అవాంఛిత ఫలితాలు రాకుండా ఉండేందుకు నిరంతరాయంగా కృషి చేస్తూనే ఉంటాము” అని గూగుల్ ప్రతినిధి ఒకరు తెలిపారు.

రచ్చ రచ్చ అయిన విషయం గూగుల్ సారీ తో కాస్త సద్దుమణిగింది.. కానీ  ఆ సర్చ్ లో మోడీ ఫోటో ను మాత్రం ఇంకా తొలగించలేదు.

ఇలా జరగడానికి గల సాకేంతిక కారణాలు  వివరించారు ప్రముఖ బ్లాగర్:  Imran Uddin

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top