మనదేశ జాతిపిత.. ఇండియాలో మోడీ రూపంలో పుట్టాడు: సింగపూర్ పత్రిక.!

నల్లధనంపై మోడీ చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్ మీద….మనదేశంలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయ్. అయితే విదేశాల్లో మాత్రం మోడీ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయాన్ని గొప్పగా కీర్తిస్తున్నారు అక్కడి జనాలు. ఇక సింగపూర్ అయితే ఓ అడుగు ముందుకేసి….మోడీని సింగపూర్ జాతిపిత లీ కున్ యే తో పోల్చి చూపుతూ…..A New Lee Koun Yew Born In India. అంటూ పెద్ద హెడ్ లైన్స్ తో అదిరిపోయే వార్త రాసింది.

లీకున్ యే….సింగపూర్ మొదటి ప్రధాని. సింగపూర్ జాతిపిత, లీ ప్రధాని పదవిలోకి వచ్చినప్పుడు సింగపూర్ అస్తవ్యస్తంగా ఉండేదట…సరిగ్గా 25 సంవత్సరాల్లో సింగపూర్ రూపు రేఖలను మార్చేశాడు లీకున్. అవినీతిని అంతమొందిస్తూ అభివృద్ది పథంలోకి సింగపూర్ ను సక్సెస్ ఫుల్ గా నడిపించాడు. దాని కోసం లీ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నాడట… ఎటువంటి ఆర్థిక లావాదేవి అయినా బ్యాంక్ ద్వారా జరిగేలా చర్యలు తీసుకున్నాడట.! అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను అత్యంత బలమైన ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాడు. అందుకే లీ  అక్కడి ప్రజల గుండెల్లో ఉంటారు.

modi

అంతటి గొప్ప చరిత్ర ఉన్న వ్యక్తితో మోడీని పోల్చుతూ ఆ దేశ వార్తాపత్రిక  వార్త  “మనదేశ జాతిపిత.. ఇండియాలో మోడీ రూపంలో పుట్టాడు” అని రాసిందంటే అర్థం చేసుకోవొచ్చు.! అప్పుడు సింగపూర్ ను లీకున్ ఎలాగైతే క్లీన్ సింగపూర్ నినాదంతో అవినీతి రహిత దేశంగా చేశారో, ఇప్పుడు ఇండియాలో పుట్టిన మరో లీ కున్ ( మోడీ) కూడా….స్వచ్చ్ భారత్ పేరుతో అవినీతిపై ప్రత్యక్ష యుద్దానికి దిగారంటూ సదరు వార్తలో మోడీ నిర్ణయాన్ని కొనియాడడం జరిగింది.

modi-in-singapore_650x400_71427615439

2015లో లీ కున్ చనిపోయినప్పుడు……ఆయనకు నివాళులు అర్పిస్తూ మోడీ “లీ కున్,  గొప్ప దార్శనికుడు, నాయకుల్లో సింహం లాంటివాడు, అతని జీవితం అందరికీ గొప్ప పాఠం.” అని అన్నారు.

Comments

comments

Share this post

scroll to top