ప్రధాని మోడీ కలిసిన ఆ పిల్లాడు ఎవరో తెలుసా..? మోడీ ఏం గిఫ్ట్ ఇచ్చారంటే..!

భూటాన్‌.. మన పొరుగు దేశం. అనేక ప్రకృతి అందాలకు నిలయం ఆ దేశం. భారతీయులు ఎవరైనా ఆ దేశం వెళ్లాలంటే ఇప్పటికీ వీసా అవసరం లేదు. కేవలం పాస్‌పోర్టు ఉంటే చాలు. అయితే ఇప్పటికీ అక్కడ రాచరిక వ్యవస్థ కొనసాగుతోంది. కాగా ఆ దేశానికి చెందిన రాజు, రాణి, వారి యువరాజు ప్రస్తుతం ఇండియాలో పర్యటించారు. అందులో భాగంగా ఆ రాజుల కుటుంబం ఈ మధ్యే ప్రధాని మోడీ తోపాటు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కూడా కలిసింది. మరి మోడీని కలిసిన సందర్భంగా ఆ దేశ బుల్లి యువ రాజుకు  ఏ బహుమతి లభించిందో తెలుసా..?

భూటాన్‌ రాజు, రాణి, యువరాజు ఇటీవలే ఇండియాలో పర్యటించారు. వారు తమ పర్యటనలో భాగంగా విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ను మొదట కలిశారు. అనంతరం ప్రధాని మోడీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా మోడీ భూటాన్‌ బుల్లి యువరాజుతో సరదాగా గడిపారు. ఆయన ఆ బుల్లి యువరాజుకు ఓ ఫుట్‌బాల్‌ను బహుమతిగా ఇచ్చారు. అది ఇటీవల జరిగిన ఫిఫా అండర్‌ 17 ప్రపంచ కప్‌కు సంబంధించినది. అందులో ఓ మ్యాచ్‌లో ఆడిన ఫుట్‌బాల్‌ను ప్రధాని మోడీ ఆ బుల్లి యువజరాజుకు బహుమతిగా అందించారు.

దీంతో ఈ విషయం కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే కేవలం ఫుట్‌బాల్ ఇవ్వడం మాత్రమే కాదు, మోడీ ఆ బుల్లి యువరాజుతో కొంత సేపు సరదాగా గడిపారు. చెస్ కూడా ఆడారు. ఈ క్రమంలోనే ఆ ఫొటోలు ఇప్పుడు నెట్‌లో హల్‌ చల్‌ చేస్తున్నాయి. కావాలంటే మీరూ వాటిని చూడవచ్చు. ఇంతకీ ఆ బుల్లి యువరాజు వయస్సు  ఎంతో తెలుసా ? కేవలం 1.5 సంవత్సరాలు మాత్రమే. అవును మరి, అంత చిన్న  ఏజ్‌ కనుకనే ఆ బుల్లి యువరాజు చేసిన చేష్టలు మోడీకి కూడా నచ్చుంటాయి. అందుకనే అతనితో మోడీ సరదాగా గడిపి ఉంటారు..!

Comments

comments

Share this post

scroll to top