ప్రధాని అయ్యాక మోడీ పర్యటించిన దేశాలు 40 కు పైనే..మొదటి సంవత్సర పర్యటన ఖర్చు 41 కోట్లు!?

మే 26 తో మోడీ భారతదేశ ప్రధాని బాధ్యతలు చేపట్టి రెండు సంవత్సరాలైంది. ఈ సందర్భంగా మోడీ ఈ రెండేళ్ళ కాలంలో చేసిన పర్యటనల వివరాలను తెలియజేస్తూ ఓ ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. అచ్చేదిన్ అనే కాన్సెప్ట్ తో ప్రధాని అయ్యాక  మోడీ విజిట్ చేసిన మొదటి  దేశం బూటాన్…..బూటాన్ తో మొదటు మోడీ ఇప్పటి వరకు 40 కు పైగా దేశాలను సందర్శించారట..RTI యాక్ట్ ప్రకారం వీటి వివరాలు అడగగా. మోడీ  మొదటి సంవత్సరం పర్యటనా ఖర్చులు 41.1 కోట్లు అయ్యాయట..!
మోడీ ప్రతీ టూర్…వివిధ దేశాధినేతలతో  మీటింగ్ లు, ఒకరికొరకు సహాయం చేసుకునే ఫైల్స్ మీద సంతకాలు ….ఫైనల్ గా నవ్వు ముఖాలతో  సెల్పీలతో సాగిందట… అయితే మోడీ విదేశీ పర్యటనలపై సోషల్ మీడియాలో మస్త్ జోకులు పేలాయి. అప్పటి ప్రధాని మన్మోెహన్ సైలెంట్ మోడ్  లో ఉంటే, ఇప్పటి ప్రధాని ఫ్లైట్ మోడ్ లో ఉన్నారంటూ ఎన్నో ఛలోక్తులు వినిపించాయి…మన ప్రధాని మనదేశంలో కంటే విదేశాల్లోనే ఎక్కువగా ఉన్నారనే సెటైర్లు వినిపించాయి.
namotravel_1464151477
namotravel8_1464171812

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top