పెళ్ళై 6 ఏళ్లయ్యిందంటే…తమ ఫస్ట్ నైట్ గురించి సరదాగా అశ్విన్ భార్య ఏమని పోస్ట్ చేసిందో చూడండి!

రవి చంద్రన్‌ అశ్విన్‌… భారత జట్టులో ఇప్పుడో కీలక బౌలర్‌ ఇతను. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ గుండెల్లో తన బౌలింగ్‌తో వణుకు పుట్టిస్తాడు. బంతిని స్పిన్‌ తిప్పుతూ కీలకమైన సమయంలో వికెట్లు తీయగల దిట్ట. ఇప్పుడు తాజాగా శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌ కోసం కోల్‌కతాలో ఉన్నాడు. అయితే ప్రస్తుతం అతను పెళ్లి చేసుకుని 6 సంవత్సరాలు పూర్తవుతోంది. ఈ క్రమంలోనే అశ్విన్‌ భార్య ప్రీతి అశ్విన్‌ తమ వెడ్డింగ్‌ యానివర్సరీ సందర్భంగా పలు విషయాలను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ముఖ్యంగా తమ పెళ్లయిన రోజున ఫస్ట్‌ నైట్‌ రోజు జరిగిన విషయాల గురించి ఆమె ట్విట్టర్‌లో చెప్పింది.

తప్పుగా అనుకోండి. ఫస్ట్‌ నైట్‌ విషయాలు అంటే వేరే ఏవో కాదు. అది అశ్విన్‌ ఆటకు సంబంధించినది. వారికి పెళ్లయిన రోజున.. అంటే సరిగ్గా 6 ఏళ్ల కిందట నవంబర్‌ 13వ తేదీన అశ్విన్‌కు, ప్రీతికి వివాహం అయింది. అయితే అదే రోజున ఫస్ట్‌ నైట్‌ జరగాల్సి ఉంది. కానీ తెల్లారితే కోల్‌కతాలో టెస్ట్‌ మ్యాచ్‌ ఆడాలి. అది అశ్విన్‌కు కీలకం. దీంతో ప్రీతి ఫస్ట్‌ నైట్‌ రోజున అతన్ని నిద్రపొమ్మని చెప్పింది. దీంతో మరుసటి రోజు ఫ్రెష్ గా ఆట ఆడవచ్చని ఆమె అభిప్రాయం. అలాగే జరిగింది కూడా. ఆ తరువాత అశ్విన్‌ క్రికెట్‌లో ఎంతగా రాణించాడో అందరికీ తెలిసిందే.

అయితే సరిగ్గా మళ్లీ 6 ఏళ్లకు అంటే.. తాజాగా ఇప్పుడు మళ్లీ అదే కోల్‌కతాలో మ్యాచ్‌ అవుతోంది. దీంతో అశ్విన్‌ అక్కడే ఉన్నాడు. ఈ క్రమంలో తనను బాగా మిస్‌ అవుతున్నానంటూ ప్రీతి అశ్విన్‌ ట్వీట్‌ చేయగా, అందుకు అశ్విన్‌ రొమాంటిక్‌గా రిప్లై ఇచ్చాడు. ఇక వీరిద్దరి ట్వీట్‌ సంభాషణలకు నెటిజన్లు కూడా లవ్లీగా స్పందించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Comments

comments

Share this post

scroll to top