హైద్రాబాద్ మారేడ్ పల్లి ఠానా పై దాడి- షాక్ కు గురైన పోలీసులు( VIDEO)

మంగళవారం  రాత్రి 8 గంటల ప్రాంతంలో మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్ పై 200 మందికి పైగా ఆందోళన కారులు విరుచుకుపడ్డారు. అడ్డొచ్చిన  ఇద్దరు SI లు, ముగ్గురు కానిస్టేబుల్లపై దాడి చేసి, స్టేషన్ లోని ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు.  అంతటి తో ఆగకుండా కీలకమైన ఫైల్స్ ను , పోెలీసు వాహనాలకు  నిప్పు పెట్టారు. వెంటనే అప్రమత్తమయిన పోలీసులు సాయుధ బలగాల సహాయంతో అందోళన కారులను చెదరగొట్టారు.

ఆదివారం జరిగిన  భోనాల ఉత్సవం సంధర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తడంతో ,  పోలీసులు  వారిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకొని, విచారించి వదిలిపెట్టారు. అయితే అందులో విడుదల తర్వాత  బన్నప్ప అనే వ్యక్తి చనిపోయాడు. దీనికి పోలీసులే కారణం అని ఆరోపిస్తూ ఆందోళనకారులు ఈ  ధాడికి దిగారు.

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top