రూ.1.65 కోట్ల పెట్రోల్ కారు కొని… అందులో డీజిల్ కొట్టించాడు ఆ ఎమ్మెల్యే కొడుకు..! త‌రువాత ఏం జ‌రిగిందంటే..!

ధ‌న‌వంతులకైతే కారు కొన‌డం చాలా తేలిక‌. ఇక వారి కింది స్థాయిలో ఉండే వారికైతే కారు కొనాలంటే అంత ఆషామాషీ విష‌యం కాదు. ఈఎంఐలు పెట్టుకుని మ‌రీ కొంటారు. అయితే ఎవ‌రు కొన్నా, ఏ కారు కొన్నా… దాంట్లో ఎలాంటి ఇంధ‌నం నింపుతారో క‌చ్చితంగా అవ‌గాహ‌న ఉండాల్సిందే. లేక‌పోతే ఇదిగో… అచ్చం ఈ ఎమ్మెల్యేకు జ‌రిగిన‌ట్టే జ‌రుగుతుంది. అవునా… అని ఆశ్చ‌ర్య‌పోకండి. ఇంత‌కీ అత‌నికి ఏం జ‌రిగిందో తెలుసుకోండి..!

ఆయ‌న పేరు మొహియుద్దీన్ బావా. క‌ర్ణాట‌క‌లోని మంగ‌ళూరు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ఇత‌ను. ఇత‌నికి ఎన్నో బిజినెస్ లు ఉన్నాయి. వాటిలో మైనింగ్ ఒక‌టి. అయితే మొన్నా మ‌ధ్యే వోల్వో కంపెనీ మార్కెట్‌లోకి ఓ కారు విడుద‌ల చేసింది తెలుసు క‌దా. అదేనండీ, Volvo XC 90 Excellence T8 Plugin Hybrid luxury car అది. దాని ఖ‌రీదు రూ.1.65 కోట్లు. కొడుకు అడిగాడ‌ని, ఆ కారు కొన్నాడు మొహియుద్దీన్‌. అయితే కారు కొన్న ఆనందం వారికి కొంత సేపు కూడా నిల‌వ‌లేదు. ఎందుకంటే…

మొహియుద్దీన్ కొడుకు కారులో ఫ్యుయ‌ల్ నింపుకోవ‌డం కోసం పెట్రోల్ బంక్‌కు వెళ్లాడు. ఈ క్ర‌మంలో ఆ కారులో పెట్రోల్‌, డీజిల్ ఏది నింపుతారో అత‌ను అక్క‌డి బంక్ సిబ్బందికి చెప్ప‌లేదు. దీంతో వారు స‌హ‌జంగానే అన్ని కార్ల‌కు నింపిన‌ట్టుగానే అందులోనూ డీజిల్ నింపారు. తీరా నింపాక గానీ తెలియ‌లేదు, అది పెట్రోల్ కార‌ని. దీంతో ఆ ఎమ్మెల్యే కొడుకు జ‌రిగిన పొర‌పాటు గుర్తించాడు. అయితే విష‌యం తెలుసుకున్న ఎమ్మెల్యే మొహియుద్దీన్ స్పందిస్తూ… అందులో ఎవ‌రినీ త‌ప్పు ప‌ట్ట‌లేమ‌ని, అది అలా జ‌రిగిపోయింద‌ని అన్నాడు. ఈ క్ర‌మంలో కారును వోల్వో స‌ర్వీస్ పాయింట్‌కు పంపారు. ఇప్పుడు దాని ఇంజిన్ మొత్తం క్లీన్ చేయాల‌ట‌. అందుకు బాగానే ఖ‌ర్చు అవుతుంద‌ని తెలిసింది. అది కంపెనీ మిస్టేక్ కాదు, వారు స్వ‌యంగా చేసుకుంది, పెట్రోల్ నింపాల్సిన దాంట్లో డీజిల్ నింపారు క‌దా, అందుకు గ్యారంటీ కూడా వ‌ర్తించ‌దు. దీంతో డ‌బ్బులు వెచ్చించి మ‌రీ కారును రిపేర్ చేయిస్తున్నాడ‌ట ఆ ఎమ్మెల్యే..! అవును మ‌రి, వాహ‌న‌మైనా, ఇంకోటైనా మ‌నం త‌ప్పు చేస్తే మ‌న‌మే మూల్యం చెల్లించుకోవాలి క‌దా..!

Comments

comments

Share this post

scroll to top