జ‌నాల స‌మ‌స్య‌ల‌పై మీటింగ్ పెట్టి…122 మంది MLA ల‌ను ఆహ్వానిస్తే….ఒక్క‌రంటే ఒక్క MLA రాని వైనం.

ఎమ్మెల్యే, ఎంపీ… ఇలా ఏ ప‌ద‌వి కోస‌మైనా ఎన్నిక‌లు జ‌రిగిన‌ప్పుడు ఆయా పార్టీల‌కు చెందిన అభ్య‌ర్థులు వ‌చ్చి ప్ర‌జ‌ల‌ను ఓట్లు అడ‌గ‌డం మామూలే. ఈ క్ర‌మంలో వారు జ‌నాల‌ను ఆక‌ట్టుకోవ‌డం కోసం ఎలాంటి ప‌ని చేయ‌డానికైనా వెనుకాడ‌రు. అయితే ఎన్నిక‌ల్లో భాగంగా ఏ నాయకుడైనా అనేక వాగ్దానాల‌ను గుప్తిస్తుంటారు. కానీ… తీరా అధికారంలోకి వ‌చ్చాక అస‌లు ఆ వాగ్దానాల ఊసే ఎత్త‌రు. ఇది మ‌న దేశంలో ఎక్క‌డైనా జ‌రుగుతున్న‌దే. ఈ క్ర‌మంలోనే అలా వాగ్దానాల‌ను మ‌రిచిన ఎమ్మెల్యేల‌ను నిల‌దీసి అడిగేందుకు త‌మిళ‌నాడులో ఈ మ‌ధ్యే ఓ కార్య‌క్ర‌మం పెట్టారు. దాని పేరు కాఫీ విత్ ఎమ్మెల్యేస్‌. మ‌రి దానికి ఎలాంటి స్పంద‌న వ‌చ్చిందో తెలుసా..?

త‌మిళ‌నాడులోని చెన్నైకి చెందిన అరప్పూర్ ఇయ‌క్కం అనే ఓ స్వ‌చ్ఛంద సంస్థ ఇటీవల కాఫీ విత్ ఎమ్మెల్యేస్ అనే ఓ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించింది. దానికి అధికార పార్టీకి చెందిన 122 మంది ఎమ్మెల్యేల‌ను కూడా ఆహ్వానించింది. అయితే ఆ కార్య‌క్రమానికి రావాల‌ని ఆహ్వానించ‌డానికి వెళితే కొంద‌రు ఎమ్మెల్యేలు దురుసుగా ప్ర‌వ‌ర్తించార‌ట‌. స‌ద‌రు స్వచ్ఛంద సంస్థ‌కు చెందిన ప్ర‌తినిధుల‌ను బెదిరిస్తూ అస‌భ్య ప‌ద‌జాలం వాడారట‌. అయినా ఆ గ్రూప్ స‌భ్యులు అదేదీ మ‌న‌స్సులో పెట్టుకోలేదు. జ‌నాల మంచి కోసం కాబ‌ట్టి వారు ఆ విష‌యాల‌ను లైట్ తీసుకున్నారు. వ‌చ్చిన ఎమ్మెల్యేల‌తోనే ఆ కార్య‌క్రమాన్ని నిర్వ‌హించాల‌ని అనుకున్నారు. అయితే అలా అనుకున్న ఆ సంస్థ స‌భ్యుల‌కు నిరాశే ఎదురైంది.

కాఫీ విత్ ఎమ్మెల్యేస్ కార్య‌క్ర‌మానికి 122 మంది ఎమ్మెల్యేలు కాదు క‌దా క‌నీసం ఒక్క ఎమ్మెల్యే కూడా హాజ‌రు కాలేదు. దీంతో షాక‌వ‌డం అక్క‌డికి వ‌చ్చిన ప్ర‌జ‌ల వంతైంది. తాము ఓట్లు వేసి గెలిపించిన నాయ‌కుల‌కు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకుందామ‌ని అక్క‌డికి పెద్ద ఎత్తున జ‌నాలు వ‌చ్చారు. కానీ వారి న‌మ్మ‌కాన్ని మాత్రం ఆ నాయ‌కులు వ‌మ్ము చేశారు. ఎంతో దూరం నుంచి ఆ కార్య‌క్ర‌మానికి పెద్ద ఎత్తున జ‌నాలు వ‌స్తే క‌నీసం ఒక్క ఎమ్మెల్యే కూడా హాజ‌రు కాక‌పోవ‌డం అందరినీ విస్మయానికి గురి చేసింది. అయితే కార్య‌క్ర‌మాన్ని మాత్రం వారు ఆప‌లేదు. ఎమ్మెల్యేల‌కు బ‌దులుగా వారి ఫేస్ మాస్క్‌ల‌ను కొంద‌రు వేసుకుని వారిని అనుక‌రించే ప్ర‌య‌త్నం చేశారు. దీంతోపాటు వారికి వ్య‌తిరేకంగా పాటలు ప‌డుతూ నాట‌కాలు వేశారు. కొంద‌రైతే ఇంకా ఏమ‌న్నారో తెలుసా..? వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ ఎమ్మెల్యేలు ఎలా గెలుస్తారో చూస్తాం..! వారు మా ద‌గ్గ‌రికి ఓట్ల‌కు రాక‌పోతారా..! అప్పుడు చెబుతాం వారి ప‌ని..! అని అన్నార‌ట‌. అవును మ‌రి, అది నిజ‌మే. జ‌నాల చేతిలో ఉన్న ఆయుధం ఒక్కటే క‌దా… అదే ఓటు..! దాంతోనే అలాంటి నాయ‌కుల‌కు బుద్ధి చెప్పాలి..!

Comments

comments

Share this post

scroll to top