ఆర్‌టీసీ బ‌స్సులో ఆ ఎమ్మెల్యే ప్ర‌యాణించి జ‌నాల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్నారు. ఆయ‌న ఎవ‌రో తెలుసా..?

స‌ర్పంచ్‌, ఎమ్మెల్యే, ఎంపీ.. ఇలా ఏ ప్ర‌జా ప్ర‌తినిధి అయినా స‌రే ప‌ద‌విలోకి రావ‌డం ముఖ్యం కాదు. అందులోకి వ‌చ్చాక నిత్యం ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను గుర్తెరిగి ప్ర‌వ‌ర్తించాలి. వారి మ‌ధ్య‌లో ఉంటూ, వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ వాటి ప‌రిష్కారానికి కృషి చేయాలి. అంతేకానీ ఏసీ రూమ్‌ల‌కే ప‌రిమితం కాకూడ‌దు. ఇలా అనుకున్నారో ఏమో గానీ ఎమ్మెల్యే వివేక్ తాజాగా కుత్బుల్లాపూర్‌లోని త‌న ఇంటి నుంచి అసెంబ్లీ వ‌ర‌కు ఆర్‌టీసీ బ‌స్సులో ప్ర‌యాణించి అంద‌రినీ ఆశ్చ‌ర్య ప‌రిచారు. బ‌స్సులో ప్ర‌యాణిస్తూ ప్ర‌యాణికుల స‌మ‌స్య‌ల‌ను ఆయ‌న అడిగి తెలుసుకున్నారు.

ఎమ్మెల్యే వివేక్ కుత్భుల్లాపూర్ బస్ స్టాప్ లో 9Q సుభాష్ నగర్ – సీబీఎస్ ఆర్డినరీ బస్సు ఎక్కి టికెట్ తీసుకొని ప్రయాణికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. త‌రువాత ఆయ‌న అసెంబ్లీ ఎదురుగా ఉన్న‌ ఆల్ ఇండియా రేడియో బస్సు స్టాప్ లో దిగి కాలినడకన అసెంబ్లీకి చేరుకున్నారు. ఎప్పటి నుంచో బస్సులో అసెంబ్లీకి వచ్చి సమస్యలు తెలుసుకోవాలనుకున్నాన‌ని అది ఇప్పుడు సాధ్యమైందని ఎమ్మెల్యే వివేక్ అన్నారు. ఇక ఆయ‌న బ‌స్సులో సాధార‌ణ ప్ర‌యాణికుడికి మ‌ల్లె ప్ర‌యాణం చేశారు. త‌న ఇద్ద‌రు గ‌న్‌మెన్ల‌కు కూడా టిక్కెట్ తీసుకున్నారు. ఇక బ‌స్సులోకి ఆయ‌న ఎక్కిన వెంటనే అందులో ఖాళీ లేక‌పోవ‌డంతో ఓ విద్యార్థి లేచి ఆయ‌న‌కు సీటు ఇచ్చాడు. దీంతో ఆ సీటులో కూర్చున్న వివేక్ బ‌స్సులో ప్ర‌యాణిస్తున్న వారిని స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్నారు.

టిక్కెట్ తీసుకున్న అనంత‌రం ఎమ్మెల్యే వివేక్ ఆ బ‌స్సులో ఉన్న ప్ర‌యాణికుల‌తో ముచ్చ‌టించారు. బ‌స్సులు రెగ్యుల‌ర్‌గా న‌డుస్తున్నాయా ? బ‌స్సుల ప‌రంగా ఎలాంటి స‌మ‌స్య‌లు ఉన్నాయి ? అని అడ‌గ్గా అంద‌రూ ఒకేలాంటి స‌మాధానం ఇచ్చారు. ఇప్పుడంటే సెల‌వులు ఉన్నాయి గానీ సాధార‌ణ రోజుల్లో ఫుట్ బోర్డింగ్ చేయాల్సి వ‌స్తుంద‌ని కొంద‌రు స్టూడెంట్స్ చెప్పారు. క‌నుక‌ బ‌స్సుల సంఖ్య పెంచాల‌ని వారు అన్నారు. ట్రాఫిక్ బాగా ఉంటున్నందున ఆ స‌మ‌స్య తీర్చాల‌ని కొంద‌రు అడిగారు. ఇక ఆ బ‌స్సు కండ‌క్ట‌ర్‌ను, ప‌లువురు మ‌హిళా ప్ర‌యాణికుల‌ను కూడా స‌మ‌స్య‌ల గురించి అడ‌గ్గా వారు కూడా ఇలాగే బ‌దులిచ్చారు. జ‌నాలు ఎక్కువ‌వుతున్నందున బ‌స్సుల సంఖ్య‌ను పెంచాల‌ని, ట్రాఫిక్ స‌మ‌స్య‌ను తీర్చాల‌ని వారు కోరారు. అయితే వీటిన్నింటినీ ఓపిగ్గా విన్న ఎమ్మెల్యే వివేక్ స‌మ‌స్యల ప‌రిష్కారానికి త‌న‌వంతు కృషి చేస్తాన‌న్నారు. ఏది ఏమైనా.. ప్ర‌జా ప్ర‌తినిధులు అన్నాక అప్పుడ‌ప్పుడు ఇలా జ‌నాల్లో తిర‌గాల్సిందే. వారు ప‌డే క‌ష్టాల‌ను అనుభ‌వించాల్సిందే. లేక‌పోతే ఆ నాయ‌కుల‌కు స‌మ‌స్య‌లు తెలియ‌వు క‌దా..! ఏమంటారు..!

http://telugu.newsdogshare.com/a/article/5aafd1b412313a10c3706dd3/?d=false

Comments

comments

Share this post

scroll to top