మ‌హిళా ఐపీఎస్ అని కూడా చూడ‌కుండా ఆమెను నోటికొచ్చిన‌ట్టు ఆ ఎమ్మెల్యే తిట్టాడు తెలుసా..?

అవును మ‌రి. పొగ‌రుబోతు రాజ‌కీయ నాయ‌కులు అంటే ఆ మాత్రం పొగ‌రు ఉంటుంది లెండి. అధికారంలో ఉన్నామ‌నే గ‌ర్వం, అహంభావం, తాము ఏం చేసినా చెల్లుతుంద‌నే నియంతృత్వ భావ‌న ఆ మాత్రం ఉంటాయి. అలాంటి స్థితిలో ఉన్న నేత‌ల‌కు క‌న్నూ మిన్నూ కాన‌రాదు. అలాంట‌ప్పుడు ఏమైనా కూత‌లు కూస్తారు. అవ‌త‌ల ఉన్న‌ది ఎవ‌ర‌నేది చూడ‌రు. వారికి ఆడ‌, మ‌గ, ముస‌లి, ముతకా, చిన్నా, పెద్దా తేడా ఉండ‌దు. ఎవ‌రిపైనైనా క‌ల‌బ‌డ‌తారు. ఎంత‌టి వారినైనా దూషిస్తారు. ఆ ఎమ్మెల్యే చేసింది కూడా అదే. విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న పోలీస్ అధికారిణి, అందులోనూ మ‌హిళ అని కూడా చూడ‌కుండా అత‌ను ఆమెను నోటికొచ్చిన‌ట్టు తిట్టాడు.

ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రంలోని కొయిల్వా గ్రామం అది. అక్క‌డ అక్ర‌మ సారా అమ్మ‌కాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో స్థానికంగా ఉండే మ‌హిళ‌లు కొంద‌రు సారా అమ్మకాల‌ను అరిక‌ట్టాల‌ని డిమాండ్ చేస్తూ ఆందోళ‌న చేప‌ట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఐపీఎస్ అధికారిణి చారు నిగ‌మ్ అక్క‌డికి చేరుకుంది. ఆమెతోపాటు అక్క‌డి గోర‌ఖ్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే రాధా మోహ‌న్ దాస్ అగ‌ర్వాల్ కూడా సంఘ‌ట‌న స్థ‌లానికి వ‌చ్చాడు. అయితే చారు నిగ‌మ్ మాట్లాడుతుండ‌గానే ఆమెకు అడ్డు చెబుతూ రాధా మోహ‌స్ దాస్ ఆమెను ఇష్టం వ‌చ్చిన‌ట్టు తిట్టాడు.

దీంతో చారునిగ‌మ్ క‌న్నీళ్లు పెట్టుకుంది. తాను ఇక్క‌డ ఇన్‌చార్జి ఆఫీస‌ర్ అని, తానేం చేస్తుందో త‌న‌కు తెలుస‌ని ఆమె చెప్పింది. అయిన‌ప్ప‌టికీ ఆ ఎమ్మెల్యే విన‌లేదు. త‌న తిట్ల‌ను కొన‌సాగించాడు. నీ హ‌ద్దుల్లో నువ్వు ఉండు, నాకు అంతా తెలుసు అంటూ తిట్ల దండ‌కాన్ని ముగించాడు. ఈ క్ర‌మంలో చారు నిగ‌మ్ ఇంకా క‌న్నీటి ప‌ర్యంత‌మైంది. హ్యాండ్ క‌ర్చీఫ్‌తో క‌ళ్లు తుడుచుకుంది. చుట్టూ అంద‌రూ ఉన్న‌ప్ప‌టికీ ఆ పొగ‌రుబోతు ఎమ్మెల్యేకు వ్య‌తిరేకంగా ఎవ‌రూ మాట్లాడలేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అవును మ‌రి, ఏమంటాడో, ఏం చేస్తాడో తెలియ‌దు క‌దా, అప్పుడు ఎవ‌రైనా ఏం మాట్లాడ‌తారు, అంతటి గ‌ర్వం ఉన్న నేత‌ల‌కు వ్య‌తిరేకంగా మాట్లాడేందుకు ఎవ‌రు సాహ‌సం చేస్తారు..? ఏది ఏమైనా ఈ విష‌యం ప‌ట్ల ఇప్పుడు స‌ర్వ‌త్రా చ‌ర్చించుకుంటున్నారు. ఆ ఎమ్మెల్యే తీరును త‌ప్పు ప‌డుతున్నారు..!

Comments

comments

Share this post

scroll to top