మైనర్ బాలికపై MLA అత్యాచారం .? అరెస్ట్!!

అతనో  MLA , ప్రజలకు ప్రభుత్వానికి మద్య వారథి లాంటి వాడు.  ప్రజల తరఫున ప్రాతినిథ్యం వహించి… ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన మనిషి. ఆ మనిషే పశువుగా మారాడు. తన ఇంట్లో పనిచేసే మైనర్ బాలికపైనే అత్యాచారానికి  పాల్పడ్డాడు.  అస్సాంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది.  పూర్తి వివరాల్లోకి వెళితే..

అస్సాంలోని  బొకొ  ఎమ్మెల్యే దాస్ తన ఇంట్లో పనిచేస్తున్న 14 ఏళ్ల బాలికను ఏదో పనినిమిత్తం తన కారులోబయటికి  తీసుకెళ్లి గువహటి ప్రాంతంలో ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం బాలికను అక్కడే వదిలి వెళ్లాడు. మొదట షాక్ గురైన బాలిక తర్వాత తేరుకొని  దగ్గర్లోని పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు  కేసునమోదు చేసుకున్న పోలీసులు . ఎమ్మెల్యేను అరెస్ట్ చేసేందుకు వెళ్లగా, అతను  పరార్ అయ్యాడు. ఈ నేపథ్యంలో దాస్ కోసం గాలింపు చేపట్టిన పోలీసులు ఆదివారం నాడు పట్టుకున్నారు. అయితే ఆయన మాత్రం కుట్రపూరిత ఉద్దేశంతోనే బాలిక తనపై అత్యాచార ఆరోపణలు చేస్తోందని  ఆరోపించారు.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top